స్థానిక ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్, కూటమి కొత్త ఫార్ములా - జగన్ వాట్ నెక్స్ట్..!!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పైన కసరత్తు మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ల జాబితా సేకరిస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. సీఎం చంద్రబాబు సైతం పార్టీ నేతలకు ఇప్ప టికే స్థానిక ఎన్నికల పై అప్రమత్తం చేసారు. కాగా, . ఎన్నికల సమయంలో కూటమి నేతలు బీసీ రిజర్వేషన్లు 34 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పై నిర్ణయం .. కోర్టు తీర్పుతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయా నికి సిద్దమవుతోంది. దీంతో.. ఈ పరిణామాలు ఎవరికి కలిసి వస్తాయనే ఆసక్తి కరంగా మారుతోంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పైన తాజాగా సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు ఇప్పటికే కీలక దిశా నిర్దేశం చేసారు. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వం సైతం ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టింది. మరో వైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో జరిగే అవకాశాలున్నాయి. అయితే వచ్చే మార్చిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు మాత్రం షెడ్యూల్‌ ప్రకారం జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఉండటంతో.. ఆ తరువాత నిర్వహించనున్నారు. అయితే, ఇక్కడే కీలక అంశం తెర మీదకు వచ్చింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలంటే బీసీ కులాల జనాభా నిర్ధారణ జరగాలి. ఇందుకు డెడికేషన్‌ కమిషన్‌ను నియమించాల్సి ఉంది. ఈ కమిషన్‌ రాష్ట్రం లోని ప్రతి నియోజకవర్గంలోనూ బీసీల కులగణన చేపట్టి.. ఏ జిల్లా, మండలం, గ్రామంలో ఎంత శాతం కోటా బీసీలకు కేటాయించాలో ప్రభుత్వానికి నివేదిస్తుంది.

ap-govt-likely-to-appoint-dedication-committee-for-bc-reservations-details-here

ఇక, ఆ నివేదిక ప్రకారమే బీసీ రిజర్వేషన్‌ను సర్కారు ఖరారుచేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వచ్చే నెలలో ఈ కమిషన్‌కు చైర్మన్‌, సభ్యులను ప్రభుత్వం నియమించే వీలుంది. బీసీల రిజర్వే షన్లను 34 శాతానికి పెంచుతామని టీడీపీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీని అమలు ఇప్పుడు సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తెలంగాణ, మహారాష్ట్రల్లో బీసీ రిజర్వేషన్ల పెంపును ఇటీవల కొట్టి వేసింది. ఓబీసీ రిజర్వేషన్ల ఖరారుకు 'ట్రిపుల్‌ టెస్ట్‌' ఫార్ములా అనుసరించాలని న్యాయస్థానం స్పష్టంచేసింది. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 24 శాతం కోటా అమలవుతోంది. దీంతో, ఏపీ కూడా బీసీలకు పాత రిజర్వేషన్‌తోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం వచ్చే ఏడాది సెప్టెంబరు 23, 24 తేదీలతో ముగుస్తుంది. బీసీ కులగణన చేపట్టాలంటే మూడు నెలల సమయం పడుతుంది. జనవరిలో ఏర్పాటయ్యే డెడికేషన్‌ కమిషన్‌ ఆరు నెలల్లో అధ్యయనం పూర్తిచేసి నివేదిక అందించినా.. ఆ వెంటనే ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే.. సెప్టెంబరు-అక్టోబరుల్లో పరిషత్‌ ఎన్నికలు నెర్వ హించడానికి వీలుంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో.. కూటమి నేతలు స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 34 శాతానికి పెంచుతామని పదే పదే చెబుతున్నారు. అందుకు వీలుకాని పరిస్థితుల్లో పార్టీపరంగా కోటా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుంది.. ఎలాంటి చర్చకు దారి తీస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+