"మార్గదర్శి" పై చర్యల దిశగా - ఎన్నికల వేళ "సై"..!!

మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో ఏపీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. కొద్ది రోజులు ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష్ల శాఖ అధికారులు ఏపీలోని పలు ఛిట్ ఫండ్ సంస్థల్లో సోదాలు చేసారు. మార్గదర్శి సంస్థల్లో చేసిన తనిఖీల్లో అక్రమాలు బయటకు వచ్చాయని అధికారులు వెల్లడించారు. మార్గదర్శి సంస్థ ఇదంతా కుట్రగా పేర్కొంటోంది. ఇప్పుడు నేరుగా ప్రధాన కార్యాలయంలో సోదాలు చేస్తుండటంతో..ఇక ప్రభుత్వం చర్యల దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో సోదాలు

మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో సోదాలు


మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో ఏపీ అధికారుల సోదాలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. ఆర్దిక అక్రమాలు..నిధుల మళ్లింపు వంటి వాటి పై ఆరా తీస్తున్నారు. సోదాలు నిర్వహించాక ఎటువంటి రికార్డులు ఇవ్వలేదని..8 ఏళ్లుగా రికార్డులు సమర్పించలేదనేది అధికారుల వాదన. డిపాజిటర్ల సమాచారం కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. నిధుల మళ్లింపు పై అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మార్గదర్శికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏపీలోని 18 యూనిట్స్ లో ఏపీ అధికారులు సోదాలు నిర్వహించారు.

చర్యలు తప్పవంటూ హెచ్చరికలు

చర్యలు తప్పవంటూ హెచ్చరికలు

గతంలోనే మార్గదర్శికి సంబంధించి రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తప్పవని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేసారు. తగిన ఆధారాలతో ఉల్లంఘనలపైన చర్యలు తీసుకోవాలని జిల్లాల చిట్స్ డిప్యూటీ రిజిస్టార్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఆదేశాలు జారీ చేసారు. ఇదే సమయంలో మార్గదర్శి యాజమాన్య వాదన భిన్నంగా ఉంది. తమ సంస్థ ఆరు దశాబ్దాల చరిత్రలో ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన చరిత్ర లేదని సంస్థ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 సంస్థల్లో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారని వివరించింది. అదికారులు కోరిన సమాచారం సమకూరుస్తూ తమ సిబ్బంది సహకరిస్తున్నారని పేర్కొంది. అయినా ఏదో లోపాన్ని కనిపెట్టాలని ఉన్నతాధికారులు పదే పదే వారికి ఆదేశాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చింది.
కీలక పరిణామాల దిశగా

కీలక పరిణామాల దిశగా


ఇక, ఏపీలో ఎన్నికల దిశగా రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి జగన్ ప్రతీ సభలోనూ దుష్టచతుష్ఠయం అంటూ నలుగురి పైన ఫైర్ అవుతున్నారు. అందులో ఈనాడు పేరు ప్రస్తావిస్తున్నారు. ఆ గ్రూపులో ఒక సంస్థగా ఉన్న మార్గదర్శి పైన ఇప్పుడు ప్రభుత్వ అధికారులు సోదాలు చేయటం.. చర్యల దిశగా ఆదేశాలు జారీ చేయటంతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుందనే విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు మార్గదర్శి పైన చర్యలకు ఆదేశాలు జారీ కావటంతో..ఆ చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఉత్కంఠను పెంచుతున్నాయి. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+