మహిళల ఖాతాల్లో రూ 1500 జమ - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు పైన ఫోకస్ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ రూ 4 వేలకు పెంచుతూ అమలు చేస్తున్నారు. అదే విధంగా ఇతర హామీల అమలు పైన ఒక్కొక్కటిగా కసరత్తు మొదలైంది. ఇక..ప్రతీ మహిళ ఖాతాలో నెలకు రూ 1500 ఇస్తామని చెప్పిన మహాశక్తి పథకం అమలు పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
హామీల అమలు
ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలు పైన స్పష్టత ఇస్తోంది. అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి స్థానంలో తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా ప్రతీ ఒక్కరికి రూ 15000 చొప్పున తల్లి ఖాతాల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం పైన తాజాగా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ పథకం అమలు కానుంది. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదివే అందరికీ పథకం వర్తింస్తుందని స్పష్టం చేసింది.

మహాశక్తి పథకంపై
మరో పథకం మహాశక్తి అమలు పైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మహాశక్తి పథకం ద్వారా 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. పథకం అమలు కోసం విధి విధానాలు రూపొందిస్తున్నామని త్వరలోనే జారీ చేస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు 15 వందల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని శాసన మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి సమాధానంగా చెప్పారు.
ప్రభుత్వం కసరత్తు
ఇక..మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు పైన అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ పథకాన్ని ఆగస్టు 15న విశాఖలో ప్రారంభించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటూనే సంక్షేమ పథకాల కొనసాగింపు పైన ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది. అమలు పైన అధికారికంగా ప్రకటన చేయనుంది.












Click it and Unblock the Notifications