పేదల ఇళ్ల పండగ: రేపు రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల పంపిణీ.
"ప్రతి పేదవాడికీ గౌరవప్రదమైన గూడు ఉండాలి" అనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. రెండో విడత సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది.
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో నిర్వహించే ఈ మెగా ఈవెంట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించనున్నారు
21 నెలలు... 5.50 లక్షల ఇళ్లు..
కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 21 నెలలో రెండోసారి ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేస్తోంది. గతేడాది నవంబర్‌లో రాయచోటి నుంచి 3 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అప్పగించింది. రెండో విడతలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడపేట మండలం, పుదూరు గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమం మొదలుపెట్టి ఏడాదవుతున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు.
సీఎం చంద్రబాబు పర్యటన ఉదయం నుంచి రాత్రి వరకు నిమిషాల వ్యవధిలో పక్కాగా రూపొందించబడింది:
- ఉదయం 10:00: అమరావతి నుంచి బయలుదేరుతారు.
- ఉదయం 11:50: సూళ్లూరుపేట నియోజకవర్గం, పుదూరుకు చేరుకుంటారు.
- ఉదయం 11:55: లబ్ధిదారులతో కలిసి టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం వారితో ముచ్చటిస్తారు.
- మధ్యాహ్నం 12:40: ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
- మధ్యాహ్నం 02:40: స్థానిక నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
- సాయంత్రం 04:35: తిరుపతికి చేరుకుంటారు.
- సాయంత్రం 04:45: పీ4 వార్షికోత్సవ సభలో పాల్గొంటారు.
- రాత్రి 08:50: కార్యక్రమాలు ముగించుకుని తిరిగి అమరావతికి చేరుకుంటారు.
ఈ భారీ గృహ ప్రవేశాల కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. పారదర్శకమైన పాలనతో పేదలకు గూడు కల్పించడంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని మరోసారి చాటుకుంది.












Click it and Unblock the Notifications