ఘుమఘుమలాడే 'వెజ్ దమ్ బిర్యానీ'.. ఇలా చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది..!

వీకెండ్ వచ్చిందంటే చాలు చాలామంది బయట రెస్టారెంట్స్ లో తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇక బయటకు వెళ్లినప్పుడు అందరికీ మొదటి ఆప్షన్ బిర్యానీనే.. అయితే బయట బిర్యానీ కంటే ఎంచక్కా ఇంట్లోనే సూపర్ టేస్టీ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. నాన్ వెజ్ లోనే కాదు వెజ్ బిర్యానీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఘుమఘుమలాడే 'వెజ్ దమ్ బిర్యానీ' ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?

'వెజ్ దమ్ బిర్యానీ' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. బియ్యం 250 గ్రాములు, ఉల్లిపాయలు 2 మధ్యస్థ పరిమాణంలో, పచ్చిమిరపకాయలు మూడు లేదా నాలుగు, క్యారెట్, బంగాళాదుంప, బీన్స్ ఇష్టానుసారం, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్, ధనియాల పొడి అర టేబుల్ స్పూన్, కారం పొడి ఒకటిన్నర టీ స్పూన్, కరివేపాకు, పూదీనా, కొత్తమీర, పెరుగు అర కప్పు, నెయ్యి రెండు స్పూన్ లు, నీళ్లు తగినన్ని తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే..

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నూనె వేడి చేయాలి. ఆ తర్వాత అందులో కరివేపాకు, పుదీనా, పచ్చి మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత క్యారెట్, బంగాళాదుంప, బీన్స్ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, కారం పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని ఉడుకుతున్న కూరగాయలకు వేసి, అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేయాలి. ఒక గిన్నెలో నీరు తీసుకుని, హోల్ బిర్యానీ మసాలా వేసి, మరిగిన తర్వాత బియ్యం వేయాలి. అలా 60 నుంచి 70 శాతం ఉడికించాలి.

Veg Dum Biryani Ghumaghumala Style Common Mistake That Spoils Taste amp amp Complete Recipe Guide recipe

ఇప్పుడు ఉడికించిన బియ్యాన్ని ఉడికిన కూరపై వేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంపై వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి వేయాలి. ఇప్పడు గిన్నెపై మూత పెట్టి చుట్టూ గోధుమపిండితో సీల్ చేసి ఓ 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే సూపర్ టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+