ఆరోగ్య శ్రీ నిర్వహణ పై ప్రభుత్వ అనూహ్య నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం అరోగ్య శ్రీ నిర్వహణలో కీలక మార్పులకు సిద్దమవుతోంది. సీఎం చంద్రబాబు ఆరోగ్య శాఖ పై తాజాగా చేసిన ఆరోగ్య శాఖ సమీక్షలో ఈ మేరకు ప్రతిపాదనలు చర్చ కు వచ్చాయి. ఇక నుంచి ఆరోగ్య శ్రీ సేవల నిర్వహణలో భీమా కంపెనీల భాగస్వామ్యం గురించి చర్చించారు. ఇక, వైద్య సేవల్లోనూ కొత్త విధానాలు అమల్లోకి తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. కొత్తగా హెల్త్ కార్డు ల జారీ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ప్రభుత్వం కసరత్తు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్య శాఖలో చేపట్టాల్సిన కొత్త మార్పుల పైన కీలక సూచనలు చేసారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్‌పై దృష్టిపెట్టాలని నిర్దేశించారు. అదే విధంగా అందరికీ హెల్త్ రిపోర్టు లు రూపొందించడం.. హెల్త్ కార్డులు ఇచ్చే విధానాల అమలు పైనా చర్చించారు. సమస్యలతో ఉన్న వారు ఆస్పత్రికి రాకుండానే సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావా లని చంద్రబాబు సూచించారు. వైద్య సేవల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సేవల వినయోగం పైన ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.

భీమా కంపెనీలతో
ఎన్టీఆర్ వైద్య సేవను బీమా విధానంలో తీసుకువచ్చి నాణ్యమైన వైద్య సేవలు అందించే అంశం పైన ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. అందులో భాగంగా ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమాన్ని బీమా విధానంలో తీసుకొచ్చే ప్రతిపాదన పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య బీమా విధానం వల్ల మరింత మెరుగ్గా, నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు నివేదించారు. దీంతో, రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
కీలక మార్పులు
ఎన్టీఆర్ వైద్యసేవలో 3,257 రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల మేర హెల్త్ కవరేజ్ ఉంటుంది. ట్రస్ట్ పద్ధతిలో ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమాన్ని బీమా విధానంలో తీసుకొచ్చే అంశంపై చర్చించారు. ఆరోగ్య బీమా విధానం వల్ల మరింత మెరుగ్గా, నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని ప్రారంభించాలని సీఎం చెప్పారు. పబ్లిక్, ప్రైవేటు సెక్టార్‌లోని బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications