Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రం: జ‌గ‌న్ ప‌ట్టు నిలుస్తుందా: టీడీపీ..జ‌న‌సేన పొత్తు ఇక్క‌డి నుండే..!!

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రానికి రంగం సిద్ద‌మ‌వుతోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఒక్క సారిగా ఏపీ రాజ కీయ ముఖ‌చిత్రం మారిపోయింది. ఇప్పుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ల‌క్ష్యంగా ఇత‌ర రాజ‌కీయ పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తు న్నాయి. ఇదే స‌మ‌యంలో వ‌రుస‌గా త‌న హామీలు..న‌వ‌ర‌త్నాల అమ‌లు విష‌యంలో నిబ‌ద్ద‌త చాటుకొనేందుకు ప్ర‌య త్నిస్తున్న జ‌గ‌న్‌..మ‌రో సారి ప్ర‌జ‌ల ముందుకు వెళ్ల‌టానికి సిద్ద‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే టీడీపీ స్థానిక సంస్థ‌ల్లో జ‌గ‌న్ ను దెబ్బ తీయాల‌ని..ఇందు కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌ల‌వాల‌ని భావిస్తున్నారు. దీంతో..ఈ ఎన్నిక‌ల పోరు మ‌రో సారి పార్టీల కు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మార‌నుంది. కీల‌క స‌మీక‌ర‌ణాలకు వేదిక కానుంది.

Recommended Video

    ఆయనకు 40ఏళ్ల అనుభవం ఉండి ఏంలాభం - జగన్
    మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం క‌స‌ర‌త్తు..

    మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం క‌స‌ర‌త్తు..

    ఏపీలో మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రానికి క‌స‌ర‌త్తు మొద‌లైంది. ప్ర‌భుత్వం కొద్ది రోజులుగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ పైన ఆలోచ‌న చేస్తోంది. అందులో భాగంగా..తాజాగా మున్సిప‌ల్ శాఖ కొత్త మున్సిపాల్టీల ఏర్పాటు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చే సింది. కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చూసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించింది.
    13 జిల్లాల్లో 50 పట్టణాలను అప్ గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపింది. 31లోగా పట్టణాల స్థాయి పెంపుపై వివరాలు ఇవ్వాలని మున్సిపల్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. సమీప గ్రామాలు, ప్రాంతాల విలీనంపై మున్సిపల్ శాఖ సమాచా రం కోరింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు పట్టణాభివృద్ధిశాఖ జాబితాను పంపింది. ఏపీలో అనేక కార్పోరేష‌న్లు..మున్సిపాల్టీల కు పాల‌క వ‌ర్గాల కాల ప‌రిమితి ముగిసినా.. స్పెష‌ల్ ఆఫీస‌ర్ల పాల‌న‌లో ఉన్నాయి. మ‌రి కొన్ని కోర్టులో కేసుల కార‌ణంగా ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడు వీటిని ప‌రిష్క‌రించుకొని ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది.

    ఎన్నిక‌లు ఖాయం..జ‌గ‌న్ ప‌ట్టు నిలుస్తుందా..

    ఎన్నిక‌లు ఖాయం..జ‌గ‌న్ ప‌ట్టు నిలుస్తుందా..

    సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అనూహ్య విజ‌యం సాధించి..ముఖ్య‌మంత్రి అయిన జ‌గ‌న్ ఇప్పుడు పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపే తం చేసేందుకు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను సాధ‌ర్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. 2014లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నాలుగు జిల్లాలు మిన‌హా టీడీపీ ఏక‌ప‌క్షంగా విజ‌యం సాధించింది. ఆ త‌రువాత తిరిగి ఎన్నిక‌లు జ‌ర‌గలేదు. పార్టీ అధికారంలో ఉండ‌టం..151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ స‌మ‌యంలో అన్ని జిల్లాలోని కార్పోరేష‌న్లు..మున్సిపాల్టీల పైన వైసీపీ జెండా ఎగుర వేయాల‌నేది ల‌క్ష్యంగా పెట్టుకు న్నారు. తాజాగా వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లోనూ మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌త్యేకంగా కేటా యింపులు చేసారు. వ‌చ్చే కేబినెట్ స‌మావేశంలో కొత్త‌గా మున్సిపాల్టీల ఏర్పాటు.. పెండింగ్ ప‌నులు పూర్తి చేయ‌టం పైన నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఎన్నిక‌ల్లోగానే వార్డు వాలంటీర్ల నియామ‌కం పూర్తి చేయ‌నున్నారు.

    టీడీపీ..జ‌న‌సేన పొత్తు మొద‌ల‌వుతుందా..

    టీడీపీ..జ‌న‌సేన పొత్తు మొద‌ల‌వుతుందా..

    ఇక‌..ఏపీలో ఊహించ‌ని సీట్ల‌తో అధికారం ద‌క్కించుకున్న జ‌గ‌న్ మ‌రింత బ‌ల‌ప‌డ‌కుండా.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల నుండే ఎదుర్కోవాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే నిర్ణ‌యించారు. అందులో భాగంగా..మాజీ మిత్రుడు జ‌న‌సేన అ ధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఈ ఎన్నిక‌ల నుండే పొత్తుతో ముందుకు వెళ్లే యోచ‌న చేస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. జ‌న‌సేన సైతం తాజా ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క సీటుకే ప‌రిమితం అయింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో క‌లిసి పొత్తుతో పోటీ చేయ‌టం ద్వారా ప్ర‌ధానంగా జ‌గ‌న్ హ‌వాను ఎంతో కంత అడ్డుకోవ‌టంతో పాటుగా..రెండు పార్టీల్లోనూ వ‌ల‌స‌ల‌ను నివా రించేందుకు స‌హ‌క‌రిస్తుంద‌ని అభిప్రాయం. దీంతో..ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ టీంతో సంప్ర‌దింపులు జ‌రిపే బాధ్య‌త‌ల‌ను టీడీపీ అధినేత అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌..వీరిద్ద‌రి మ‌ధ్య పొత్తు కుదిరితే అది వైసీపీ మీద ఏ ర‌కంగా ప్ర‌భావం చూపుతుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తి క‌ర అంశం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+