రూటు మార్చిన చంద్రబాబు - కీలక నిర్ణయం...!!

ఏపీలో రాజకీయంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సీఎం చంద్రబాబు సిద్దమయ్యారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. ఆర్దికంగా సమస్యలు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. సూపర్ సిక్స్ హామీ ల అమలు పైన ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు వచ్చే ఆర్దిక సంవత్సరం నుంచి పథకాల అమలుకు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 28న ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే 2025-26 వార్షిక బడ్జెట్ పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తి స్థాయి తొలి బడ్జెట్ ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28న బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. జూన్ లో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రభుత్వం.. నవంబర్ లో పూర్తి స్థాయి అంచనా లతో బడ్జెట్ ను సభలో ఆమోదించింది. ఇప్పుడు వార్షిక బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటుగా పాలనా పరంగా ప్రాధాన్యతలను ఖరారు చేస్తూ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రతిపాదనలు చేసేందుకు సిద్దమైంది.

AP Govt planning to submit Budget 2025-26 on 28th of this month sessions to begin on 24th

బడ్జెట్ ప్రతిపాదనలు
అమరావతి, పోలవరం కు కేంద్రం నుంచి రుణాలు - నిధులు ఖాయం కావటంతో బడ్జెట్ లో ఈ రెండు ప్రాజెక్టుల పైన ఎలాంటి అంచనాలు ప్రతిపాదిస్తారనేది కీలకంగా మారుతోంది. అదే విధం గా సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ నిధుల కేటాయింపు ఈ బడ్జెట్ లో చేయాల్సిన అవసరం ఉంది. భారీ ఖర్చుగా చెబుతున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తో పాటుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో మరో కీలకమైనదిగా భావిస్తున్న ప్రతీ మహిళకు నెలకు రూ 1500 అమలు విషయం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది బడ్జెట్ ప్రతిపాదనల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రైతులు - మహిళల కోసం
తల్లికి వందనంలో భాగంగా ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ లెక్కన ఎంత మేర ఖర్చు అవుతందునే అంచనాలను అధికారులు సిద్దం చేస్తున్నారు. సుమారు రూ 10 వేల కోట్ల వరకు అవసరం అవుతుందనేది ఏపీ అధికారుల అంచనా. అదే విధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీ రైతుకు రూ 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. పీఎం కిసాన పథకం కింద ఇస్తున్న రూ 6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం మరో 14 వేలు కలిపి ఈ పథకం అమలు చేయనుంది. విడతల వారీగా అమలు దిశగా కసరత్తు చేస్తున్న ట్లు తెలుస్తోంది. ఈ పథకం కోసం నిధుల కేటాయింపుతో పాటుగా అమలు పైన బడ్జెట్ లో స్పష్టత ఇచ్చే విధంగా కసరత్తు చేస్తున్నారు.

కేటాయింపులు ఎలా
ఇప్పటికే ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం మే నెలలో.. జూన్ లో తల్లికి వందనం అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. మత్య్సకార భరోసా నిధులను సైతం అదే సమయం లో విడుదల చేయాలని భావిస్తోంది. వీటితో పాటుగా ఫీజు రీయంబర్స్ మెంట్ .. ఉద్యోగుల పెండిం గ్ నిధుల విడుదల గురించి బడ్జెట్ లో ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, సాగు నీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పైన అధికారులకు ప్రతిపాదనలు అందాయి. పెరగని రెవిన్యూ.. పెరుగుతున్న అప్పుల వేళ ఆర్దిక నిర్వహణ భారంగా మారుతోంది. దీంతో.. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+