రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం నిధుల జమ..!!
ఏపీలో ఒక వైపు రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల కౌంటింగ్ కు రంగం సిద్దమైంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే టెన్షన్ కనిపిస్తోంది. గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమాగా కనిపిస్తున్నాయి. లోలోపల మాత్రం టెన్షన్ నెలకొంది. ఈ సమయంలోనే రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సంఘం సూచన మేరకు వాయిదా పడిన రైతుల ఇన్ పుట్ సబ్సిడీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో జమ చేసింది.
ఏపీ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తూ వస్తోంది. 2023 ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులతో ఏపీలోని 103 కరువు మండలాల్లో 14.24 లక్షల ఎకరాల్లో పంటలు తిన్నాయి. దీనికి సంబంధించి 6.60 లక్షల మందికి రూ.847.22 కోట్ల కరువు సాయంగా తేల్చారు. అలాగే గతేడాది రబీ ప్రారంభంలో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలకు 6.64 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. నష్టపరిహారం కింద 4.61 లక్షల మందికి రూ.442.36 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది.

కిందటి సంవత్సరం గతేడాది ఖరీఫ్, ప్రకృతి విపత్తులు, రబీ సీజన్లలో కరువుతో నష్టపోయిన రైతులకు అకౌంట్‌లలో డబ్బులు జమ చేసింది. మొత్తం 92 శాతం మంది రైతుల అకౌంట్‌లలోకి పెట్టుబడి రాయితీ డబ్బులు జమ అయ్యాయి. 8.89 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.1,126.31 కోట్లు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతుందని..వీటిని పరిష్కరిస్తామని స్పష్టంచేసారు.












Click it and Unblock the Notifications