సిరివెన్నెల కుటుంబానికి జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్

అమరావతి: టాలీవుడ్ కు చెందిన ప్రముఖ గేయ రచయిత, దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన కుటుంబానికి 500 చదరపు గజాల స్థలాన్ని మంజూరు చేసింది. నామమాత్రపు ధరను నిర్ధారించింది ప్రభుత్వం. ఒక్కో చదరపు అడుగునకు 10 రూపాయలను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా 5,000 రూపాయలను చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు సిరివెన్నెల సీతారామశాస్త్రి చికత్స ఖర్చును కూడా ఏపీ ప్రభుత్వమే భరించింది.

దీనికోసం ప్రత్యేకంగా 30 లక్షల రూపాయలను మంజూరు చేసింది. 66 సంవత్సరాల వయస్సులో న్యుమోనియాతో బాధపడుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 నవంబర్ 11వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. సుమారు 15 రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ లో తీసుకున్నారు అప్పట్లో. కిమ్స్ డాక్టర్లు అత్యాధునికమైన వైద్య చికిత్సను అందించినప్పటికీ.. ప్రాణాలను నిలపలేకపోయారు.

AP Govt sanctioned land to late lyricist Sirivennela Seetharama Sastry family at Visakhapatnam

ఊపిరితిత్తుల్లో నెమ్ము అధికంగా చేరడం, లంగ్ క్యాన్సర్, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి తెలంగాణ.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. అప్పట్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి వైద్య చికిత్సకు అయిన ఖర్చును ఏపీ ప్రభుత్వం భరించింది. 30 లక్షల రూపాయలను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఇప్పుడు తాజాగా 500 చదరపు గజాల స్థలాన్ని సిరివెన్నెల కుటుంబానికి మంజూరు చేసింది జగన్ ప్రభుత్వం. విశాఖపట్నం సమీపంలోని ఎండాడలో ప్లాట్ నంబర్ 1బీ పరిధిలోని సర్వే నంబర్ 138-2 లో ఈ స్థలాన్ని కేటాయించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి భార్య చెంబోలు పద్మావతి పేరు మీద ఈ భూమి మంజూరయింది. ఈ మేరకు జీవో నంబర్ 571 ను రెవెన్యూ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. చదరపు గజానికి 10 రూపాయలు చొప్పున నామమాత్రపు ధరను నిర్ధారించింది.

సిరివెన్నెల కుటుంబానికి స్థలాన్ని కేటాయించడం పట్ల పలువురు సినీ ప్రముఖులు జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. టాలీవుడ్ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ మేరకు జగన్ కు థ్యాంక్స్ చెప్పారు. లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అభిమానులందరి తరఫున ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కు హృదయపూరక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+