ఈ స్కీంతో విద్యార్థుల భవిష్యత్ బంగారం.. ఇది చంద్రబాబు వరం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు ఉన్నత విద్యకు ఆటంకం కాకూడదు అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను చేపట్టింది. గత సెప్టెంబర్ మాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీలోని విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే కేంద్రం అమలు చేసే పీఎం విద్యాలక్ష్మి పథకంతో దీనిని అనుసంధానం చేసి విద్యార్థులకు వెసులుబాటు కల్పించనున్నారు.

విద్యార్థుల ఉన్నత చదువులకు స్కీం.. ఏపీ సర్కార్ కసరత్తు

ఉన్నత విద్య కోసం విద్యార్థులు రుణాలు తీసుకోవడానికి ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేకుండా, పావలా వడ్డీకే రుణాలను ప్రభుత్వం అందిస్తుందని, ఆ పావలా వడ్డీ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ప్రస్తుతం దీనిని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం కోసం కసరత్తు చేస్తున్నారు.

ap govt scheme cm chndrababu govt ready to give the scheme for the student loans for higher studies

పీఎం విద్యాలక్ష్మి పథకం కింద పదిలక్షల రూపాయల వరకు లోన్

కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం అందుబాటులోకి తీసుకు వచ్చిన పీఎం విద్యాలక్ష్మి పథకం కింద పదిలక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు. నాలుగున్నర లక్షల లోన్ పైన ప్రభుత్వమే వడ్డీని భరిస్తుంది. ఇక ఈ లోన్ విషయంలో అర్హత ఉన్న వారికి మూడు విడతల్లో రుణాలను ఇస్తుంది. వీరికి మూడు విడతల్లో రుణాలు మంజూరు కానీ పక్షంలో 15 రోజులలోగా ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది.

విదేశాలలో చదువుకునే వారికి ఈ స్కీంతో బెనిఫిట్

ఈ పథకం కింద విదేశాలలో విద్యను అభ్యసించాలి అనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. పీఎం విద్యాలక్ష్మి పథకంతో పాటు, పావలా వడ్డీ పథకాన్ని కూడా కలిపి ఏపీలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ పథకాన్ని పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి గడువు లేదు. అవసరం ఉన్నవారు ఎప్పుడైనా ఈ లోన్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది.

విద్యార్థులకు ఇలా ఉంటేనే స్కీం వర్తింపు

ఒకే విద్యార్థికి ఒకసారి మాత్రమే ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ వంటి కోర్సులు చేసే విద్యార్థులు ఈ పథకాన్ని పొందడానికి అర్హులు. విద్యార్థులు రుణాలు పొందాలంటే వారి కుటుంబ వార్షికాదాయం నాలుగు లక్షల రూపాయల లోపు ఉండాలి. దరఖాస్తుకు సంబంధించిన అన్ని వివరాలను ఆధారాలను ఇవ్వడంతో పాటు కొత్తగా ప్రవేశం పొందే కోర్సు అడ్మిట్ కార్డు కోర్సు ఫీజులు వివరాలను కూడా ఇవ్వాలి. అన్ని పూర్తిగా సబ్మిట్ చేసిన తర్వాత వీరికి రుణం వచ్చే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+