వారిని చూసి గర్వపడుతున్నా: వైఎస్ జగన్

అమరావతి: ఆ 10 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. అసలు సిసలు తెలుగు తేజానికి ప్రతిరూపాలుగా నిలిచారు. విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించిన ప్రగతిని అగ్రరాజ్యం అమెరికాలో చాటి చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలలు సాధించిన తిరుగులేని ప్రగతిని రెపరెపలాడిస్తోన్నారు.

అమెరికా పర్యటనలో ఉన్న ఆ 10 మంది విద్యార్థులు- ఇదివరకు వారు ఏకంగా ఐక్యరాజ్యసమితిలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సదస్సుకు ఏపీ తరఫున ప్రాతినిథ్యాన్ని వహించారు. ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రధాన కార్యాలయంలో అడుగు పెట్టారు.

AP govt school students meets IMF

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడమే ఓ శాపంగా భావించే పరిస్థితి నుంచి.. అందులో సీటు దక్కడమే అదృష్టంగా భావించే పరిస్థితి నెలకొంది ఏపీలో. నాడు- నేడు కింద జగన్ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేయడమే దీనికి ప్రధాన కారణం. ఇంగ్లీష్‌లో విద్యాబోధన చేపట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి ఎదగగలిగారు.

రాజేశ్వరి, జ్యోత్స్న, అంజన సాయి, గాయత్రి, శివలింగమ్మ, అమ్మాజాన్, మనస్విని, యోగీశ్వర్, రిషితారెడ్డి, చంద్రలేఖ.. అనే విద్యార్థులు అమెరికాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీ వరకు అగ్రరాజ్యంలో జరిగే పలు కార్యక్రమాల్లో వారంతా భాగస్వామ్యులు కానున్నారు.

ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలలో ఏర్పాటయ్యే సమావేశాల్లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విద్యా రంగంలో రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక కార్యక్రమాల గురించి వివరించారు.

సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి వారు ప్రసంగించడంతో పాటు నాడు నేడు, జగనన్న అమ్మవొడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు, విద్యా సంస్కరణలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ద్విభాషా పాఠ్యపుస్తకాలు, టాబ్లెట్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల విద్య గురించి తెలియజేశారు.

తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధాన కార్యాలయాన్ని వారు సందర్శించారు. ఐఎంఎఫ్ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా గీతా గోపీనాథ్ వారితో సెల్ఫీ దిగారు. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌పై దీన్ని షేర్ చేశారు. వైఎస్ జగన్‌కు ట్యాగ్ చేశారు.

దీనికి జగన్ రిప్లై ఇచ్చారు. తమ పిల్లలను కలుసుకున్నందుకు, వారికి ఘన స్వాగతం పలికినందుకు గీతా గోపీనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్య అనేది వ్యక్తిగత జీవితాలను మార్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు.

ఆ పిల్లల చిరునవ్వుల వెలుగులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోన్నాయని జగన్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర ప్రభుత్వ కీర్తి ప్రతిష్ఠలను పెంచుతున్న ఆ విద్యార్థులను చూసి తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ సెమినార్లకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోండటం సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+