ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు - బిగ్ అప్డేట్..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సవాల్ గా మారుతున్నాయి. సూపర్ సిక్స్ తో పాటుగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముందుగా రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు పైన ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.
ఏపీలో అమలు దిశగా
తెలంగాణ, కర్ణాటక తరహాలోనే ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒకటిగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కొలువు తీరుతోంది. ఇచ్చిన హామీల్లో వెంటనే అమలు చేసే అవకాశం ఉన్న వాటి పైన ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఖజనా పైన పడుతున్న భారం, లాభ - నష్టాల పైన ఫోకస్ చేసారు. ఏపీలో ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం అయింది. ఇక..రోజు వారీ బస్సుల్లో మహిళల ప్రయాణ వివరాల పైన నివేదిక కోరారని సమాచారం.

అధికారుల కసరత్తు
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరమని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్సుల్లోనే ఈ పథకం అమలు పైన ఎదురయ్యే సమస్యల పైన నివేదికలో పొందు పరుస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలు..వాటి పరిష్కార మార్గాల పైన నివేదికలో కోరనిట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. బస్సుల్లో సీట్ల కోసం గొడవలు జరిగాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సమస్యలు లేకుండా అమలు పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ నిర్ణయం తో
తెలంగాణలో ఉచిత బస్సు అమల్లో ప్రభుత్వం నుంచి రీయంబర్స్ మెంట్ ఎలా అందుతోందనేది ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో ప్రయాణించే ఆధార్ కార్డ్ చూపించిన మహిళలకుజీరో టికెట్ ఇస్తున్నారు. ఏపీలోనూ ఇదే తరహాలో అమలు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ పథకం అమలు పైన ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి పథకం అమలు ముహూర్తంపైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో..కొత్త ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా తీసుకొనే నిర్ణయాల పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications