Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సజ్జల మూలాలపై దెబ్బ కొట్టిన కూటమి ప్రభుత్వం..!!

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. వైసీపీ నేతల అక్రమాల పై కూటమి ప్రభు త్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటోంది. ఒక వైపు మద్యం స్కాం లో అరెస్టులు సంచలనంగా మారాయి. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేత సజ్జల కబ్జాల పై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 63 ఎకరాల భూములు సజ్జల ఆక్రమించినట్లుగా ఆరోపణలు రావటంతో విచారించిన రెవిన్యూ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు.

వైసీపీ ముఖ్య నేత సజ్జల కబ్జా చేసినట్లుగా ఆరోపణలు ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కడప జిల్లా సీకే దిన్నె మండల పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టే ట్‌లోని ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాదాపు రూ.220 కోట్ల విలువ చేసే 63.72 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు తేల్చారు. మిగిలినవి ఇరిగేషన్‌, అసైన్డ్‌ భూములుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ ఇదివరకే విచారణ జరిపి నివేదిక పంపారు. సజ్జల కుటుంబ సభ్యులు అటవీశాఖ, ఇరిగేషన్‌, పేదల భూములు కబ్జా చేసినట్టు గుర్తించారు. దీంతో చర్యలకు ఉపక్రమించారు. సర్వే నంబర్‌ 1629లో ఆక్రమణలో ఉన్న 52.42 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఫారెస్టు అధికారిని కడప జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

ap-govt-seized-63-acres-of-land-allegedly-encroached-by-ysrcp-leader-sajjala

అదే సమయంలో సర్వే నం. 1626/1, 2, 27లో అన్యాక్రాంతానికి గురైన భూములు స్వాధీనం చేసుకోవాలని జీఎన్‌ఎస్‌ఎస్‌ సూపరింటెండెంట్‌కు, అనుమతి లేకుండా గెస్ట్‌హౌస్ లు, ఇతర నిర్మాణాలు చేపట్టినందుకు వాటిపై చర్యలు తీసుకోవాలంటూ సీకేదిన్నె పంచాయతీ కార్యాల యానికి వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు సజ్జల ఎస్టేట్‌లోని ఆక్రమిత భూము లను స్వాధీనం చేసుకున్నారు. కడప నగరాన్ని ఆనుకుని ఉన్న సీకేదిన్నె మండల పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఎస్టేట్‌ ఉంది. ఇక్కడ ఆయన సోదరుడు సజ్జల జనార్దనరెడ్డి, అన్న కొడుకు సందీప్ రెడ్డి, సజ్జల దివాకర్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట 137.45 ఎకరా ల భూమి ఉంది. సర్వే నం.1629లో అటవీ శాఖకు 11,129.33 ఎకరాల భూమి ఉంది. ఇందు లో సజ్జల కుటుంబం 52.40 ఎకరాలు ఆక్రమించి సాగు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల పైన విచారించిన అధికారులు.. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+