వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాలంటీర్ల మామూళ్ల దందా: ప్రభుత్వం సీరియస్: నలుగురిపై వేటు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Grama Sachivalayam : 4 గ్రామ వాలంటీర్లపై వేటువేసిన AP ప్రభుత్వం || Oneindia Telugu

ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వాలంటీర్లు వ్యవస్థలో అప్పుడే దందాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ముఖ్యమంత్రి చేసిన సూచనలు బేఖాతర్ అవుతున్నాయి. ప్రభుత్వం పతీ 50 నివాసాలకు ప్రభుత్వ పధకాలు అందించేందుకు ఒక వాలంటీర్ ను నియమించింది. వీరిని గ్రామ .. వార్డు సచివాలయాలకు అనుసంధానం చేసారు. వీరు ఎటువంటి తప్పులు చేసిన నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అందు కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కేటాయించారు.

అయితే..వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభించి ఇంకా పూర్తిగా నెల రోజులుగా కూడా కాకుండానే అప్పుడే వాలంటీర్ల పైన ఫిర్యాదులు మొదలయ్యాయి. వసూళ్ల దందా ప్రారంభించారు. దీని పైన నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు రావటంతో జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేయించారు. నిరూపణ కావటంతో నలుగురు వాలంటీర్ల పైన వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ కొత్త ట్విస్ట్ .. మూడేళ్ళు పనిచెయ్యాలని నిబంధనగ్రామ సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ కొత్త ట్విస్ట్ .. మూడేళ్ళు పనిచెయ్యాలని నిబంధన

గ్రామ వాలంటీర్లు

గ్రామ వాలంటీర్లు

ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా..కాసులకు కక్కుర్తి పడిన వాలంటీర్ల పైన ప్రభుత్వం వేటు వేసింది. దసరా మామూళ్లు వసూలు చేసిన నలుగురు ప్రభుత్వ వాలంటీర్లను ప్రభుత్వం తొలిగించింది. క్రిష్టా జిల్లా మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామ వాలంటీర్లుగా పని చేస్తున్న చుక్కా విజయవర్మ.. లంకపల్లి ఒలివ..గాడెల్లి సునీల్ కుమార్.. తెనాలి వనజలు పెన్షన్ దారుల నుండి దసరా మామూళ్లు వసూలు చేసారని ఫిర్యాదులు వచ్చాయి. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి.

ఫిర్యాదులు నిజమేనని

ఫిర్యాదులు నిజమేనని

దీంతో..అక్కడి నుండి వచ్చిన సమాచారం మేరకు జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది. వారి పైన వచ్చిన ఫిర్యాదులు నిజమేనని స్థానిక అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో..వెంటనే వారిని తొలిగించాలని ఆదేశించటంతో ఆ నలుగురి పైన వేటు వేస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేసారు. ఏపీ ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్లు..అదే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ అవినీతి రహితంగా పని చేయాలని పలు మార్లు కోరారు.

వాలంటీర్లు ఇలా మామూళ్లు స్వీకరించటం

వాలంటీర్లు ఇలా మామూళ్లు స్వీకరించటం

వాలంటీర్లు నియామకం...అదే విధంగా గ్రామ సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చిన సమయంలోనూ ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని సూచించారు. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని..ఆ అవకాశం లేకుండా చూసుకోవాలని కోరారు. అయితే, నెల రోజులు కూడా కాకుండానే గ్రామ వాలంటీర్లు ఇలా మామూళ్లు స్వీకరించటం..ఫిర్యాదు వచ్చిన వెంటనే వారి పైన చర్యలు తీసుకోవటంతో ఇప్పుడు మిగిలిన వారు అలర్ట్ అయ్యారు. వాలంటీర్లు..గ్రామ సచివాలయాల పని తీరు పైన నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం మానిటరింగ్ చేస్తోంది.

English summary
AP Govt nominated village volunteers four members terminated by govt on omplaint of demand bribe for giving pensions. Govt seriously reacted on thiese complaints orderd distritct officials to take immeadiate action against them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X