రుషికొండ భవనాల పై చంద్రబాబు కీలక నిర్ణయం..!?
ఏపీలో రుషికొండ నిర్మాణల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ రుషికొండలో జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ భవనాల పైన రాజకీయంగా దుమారం కొనసాగుతోంది. ఈ నిర్మణాలు సొంతంగా వినియోగం కోసం చేసారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. పూర్తిగా ప్రభుత్వ భవనాలుగానే నిర్మాణం జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.ఈ సమయంలో ఈ భవనాల వినియోగం పైన చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
రుషికొండపై ఏం చేద్దాం
రుషికొండలో రూ 500 కోట్లతో జగన్ ప్రభుత్వం నిర్మాణాలు చేసింది. మూడు భారీ భవనాలను నిర్మించింది. ఆ భవనాలను టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సందర్శించారు. భవనంలో విలాసవంత మైన నిర్మాణాలు..ఫర్నీచర్...సౌకర్యాల పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. భారీ ఖర్చుతో వీటిని సమకూర్చినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వీటి నిర్మాణం కోసం ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ముఖ్యనేతలు..మాజీ మంత్రి రోజా ఇవి టూరిజం శాఖ పరిధిలో..ప్రభుత్వ భవనాలుగా నిర్మాణాలు జరిగాయని స్పష్టత ఇచ్చారు.

తాజా ప్రతిపాదనలు
ఇక, వైసీపీ హాయంలో నిర్మించిన ఈ భవనాలను ప్రస్తుత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ మాజీ మంత్రులు సూచిస్తున్నారు. దీని పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ భారీ నిర్మాణాలను ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకోవాలనేది ఇప్పటికే నిపుణుల సూచనలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇంత భారీ భవనాలను అధికారిక కార్యక్రమాల కోసం వినియోగిస్తే పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో, వీటిని సద్వినియోగం చేసుకుంటూనే...ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గం పైన కొత్త ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గంలో నిర్ణయం
ఈ భవనాలను టాటా గ్రూపుకు అప్పగించే ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు సమాచారం. టాటా గ్రూపు మూడు బ్రాండ్ల కింద హోటల్స్ ను నడుపుతోంది. హైదరాబాదులోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లాగా ఈ ప్యాలెస్ ను కూడా టాటా గ్రూపు నిర్వహణకు ఇవ్వటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని..ఆ మొత్తాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణకు వినియోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా ఇలా ఆ సంస్థకు అప్పగించాలా..ప్రభుత్వ ఆధీనం లో ఏ మేర ఉంటే ఉపయోగం వంటి అంశాల పైన చర్చ జరుగుతోంది. ఈ ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
-
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి?











Click it and Unblock the Notifications