AP Govt: ఏపీలో రేపు వారి ఖాతాల్లో 20 వేల జమ..! పూర్తి వివరాలివే..!
ఏపీలో మత్స్యకారుల (Fishermen) కుటుంబాలకు వేసవి సందర్బంగా వేటపై నిషేధం ఉంటుంది. చేపలు గుడ్లుపెట్టే పరిస్ధితుల్లో వాటిని వేటాడకూడదన్న నిబంధన మేరకు ఈ నిషేధాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తుంటాయి. అయితే దీని వల్ల మూడు నెలల పాటు మత్సకారుల ఉపాధి దెబ్బతినకుండా కొన్నేళ్లుగా ప్రభుత్వాలు వారికి కొంత సాయం అందిస్తున్నాయి. ఈ ఏడాది కూడా మత్సకారుల భరోసా పేరుతో కూటమి సర్కార్ (AP Govt) వారి ఖాతాల్లో రూ.20 వేల చొప్పున జమ చేయబోతోంది.
ఏపీ వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని రేపు ప్రభుత్వం అందించనుంది. రేపు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే సభలో సీఎం చంద్రబాబు మత్య్సకారుల సేవలో పథకం నిధుల్ని విడుదల చేస్తారు. అనంతరం ఈ నిధులు 20 వేల చొప్పున మత్సకారుల ఖాతాల్లో జమ అవుతాయి. ప్రతీ ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు... 61 రోజుల పాటు సముద్రంలో చేపలు పిల్లలు పెట్టే సమయంలో వేటకు విరామం ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారుల జీవనానికి ఇబ్బంది లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఇలా సాయం అందిస్తోంది.

వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20వేలు చొప్పున ఆర్థికసాయం ఇస్తామని ఎన్డీయే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీని మేరకు గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించారు. ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది. ఈ ఏడాది లబ్ధిదారు కుటుంబాల సంఖ్య కూడా పెరిగింది. రెండేళ్లలోనే మత్య్సకారుల కుటుంబాలకు వేట నిషేధ సమయంలో రూ.505 కోట్లను సాయంగా అందించింది. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేట సమయంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం సకాలంలోనే అందిస్తోంది. 2024-25లో 63 క్లెయిమ్స్‌కు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 పెండింగ్ క్లెయిమ్స్‌కు రూ.5.65 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అంతేకాకుండా వారి ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సీవీడ్ సాగును ప్రోత్సహిస్తోంది.














Click it and Unblock the Notifications