10న 'తల్లికి వందనం' రెండో విడత నిధులు- వీరికీ వర్తింపు, ఇలా చెక్ చేసుకోండి..!!

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. అర్హత ఉండీ.. నిధుల జమ కాని వారికి మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2వ తేదీ వరకు పాఠశాలల్లో చేరిన వారికి పథకం అమలు చేస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రెండో విడత అర్హుల జాబితాలను సచివాలయాల్లో అందుబాటు లో ఉంచారు. కాగా, ఈ రెండో విడతలో అర్హత కలిగిన లబ్దిదారులకు నిధుల విడుదల ముహూర్తం ప్రభుత్వం ప్రకటించింది.

10న నిధులు విడుదల
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులను గత నెల 12వ తేదీన విడుదల చేసింది. దాదాపు గా 67.27 లక్షల మంది విద్యార్థులకు పథకం అమలుచేశారు. రెండో విడతలో భాగంగా ఒకటో తరగతిలో, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో చేరిన వారికి జూలై 5న నిధులు విడుదల చేస్తా మని ప్రభుత్వం గతంలో తెలిపింది. కానీ అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నందున ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఈనెల 10న మెగా పేరెంట్‌-టీచర్స్‌ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం ఈ నెల 10వ తేదీ ముహూర్తం గా ఖరారు చేసింది. 10వ తేదీన రెండో విడత నిధులు విడుదల కానున్నాయి.

AP Govt to credit second phase of Thalli ki vandanam funds on 10th July

కొత్తగా వీరికీ ఛాన్స్
కాగా, ఇప్పటివరకూ ఒకటో తరగతిలో 5.5 లక్షలు, ఇంటర్‌ ఫస్టియర్‌లో 4.7లక్షల మంది విద్యార్థులు చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వార్డు - గ్రామ సచివాల యాలకు లబ్దిదారుల నుంచి వచ్చిన అభ్యర్ధనల పైన పరిశీలన జరుగుతోంది. కాగా. ఈ నెల 2వ తేదీ సాయంత్రం వరకు ఒకటో తరగతిలో చేరే పిల్లలకే పథకం నగదు అందుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. తొలి విడతలో డబ్బులు జమ కానివారు, ఒకటో తరగతిలో చేరే పిల్లలు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఈ నెల 10న ఖాతాల్లో డబ్బుల్ని జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో రెండో విడత తల్లికి వందనం వెరిఫికేషన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

చెక్ చేసుకోండి
ఇక, సెకండ్‌ ఫేజ్‌లో మీ పేరు ఉందో తెలుసుకోవడానికి https://gsws-nbm.ap.gov.in/ సంప్రదించాలి. రెండో విడత లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో, లేదో రెండు విధాలుగా తెలుసు కొనే అవకాశం కల్పించారు. ప్రభుత్వ వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/ ఓపెన్ చేసి తల్లికి వందనం పథకాన్ని సెలక్ట్ చేసుకుని.. విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ పథకానికి అర్హులా, కాదా అన్నది తెలుసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మన మిత్ర వాట్సాప్ సర్వీస్ నంబర్ +91 9552300009 ద్వారా తల్లికి వందనం పథకం రెండో జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన రెండో విడత నిధుల విడుదల ద్వారా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకం అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+