ఏపీలో విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, అర్హతలు - తొలిగా అమలు అక్కడే..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్ లు పంపిణీ పైన తాజాగా నిర్ణయం జరిగింది. ప్రభుత్వం.. ఇన్ఫోసిస్ కలిసి ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల్లో సాంకేతికతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరిలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ పైన విద్యార్ధుల్లో అవగాహన పెంచేందుకు ఉచితంగా ట్యాబ్ ల పంపిణీ పైన ఫోకస్ చేసింది. ఇందు కోసం ఇన్ఫోసిస్ తో కలిసి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు పేరుతో కొత్త స్కీం కు శ్రీకారం చట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు టెక్నాలజీలో నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. మంగళగిరిలో ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు డిసైడ్ అయ్యారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (CSR) కింద ముందుగా 38 ప్రాధమికోన్నత, ఉన్న పాఠశాలలకు ఇన్ఫోసిస్ సంస్థ 30 చొప్పున ట్యాబ్ లను అందించింది. వీటిని 6 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు అందించనున్నారు. ఉపాధ్యాయులు సైతం డిజిటల్ విధానంలోనే బోధన చేయనున్నారు.

ఈ మేరకు ఉపాధ్యాయులకు డిజిటల్ విద్య పైన శిక్షణ ఇచ్చారు. మంగళగిరిలో ఈ పైలెట్ ప్రాజెక్టు ఫలితాలు చూసిన తరువాత అవసరమైన మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే విధంగా కార్యాచరణ సిద్దం అవుతోంది. ఇందు కోసం6 నుంచి 9వ తరగతుల విద్యార్ధుల కోసం ఎస్సీఈఆర్టీ.. సమగ్ర శిక్ష అభియాన్ కలిసి కంటెంట్‌ను రూపొందించాయి. గణితం, సైన్స్, ఆంగ్లం, జీవన నైపుణ్యాలు వంటి సబ్జెక్టులను బోధించడానికి ఈ ట్యాబ్‌లను ఉపయోగిస్తారు. ఇన్ఫోసిస్ సంస్థ ప్రత్యేక ప్లాట్‌ఫాం ద్వారా ట్యాబ్‌ల వినియోగాన్ని పర్యవేక్షిస్తూ, నెలవారీ నివేదికలను ప్రభుత్వానికి అందిస్తుంది. ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఒక గంట, ప్రతి పాఠశాల నాలుగు గంటలు ట్యాబ్‌లను వాడేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అదే విధంగా మంచి ప్రతిభ కనిపించిన వారికి ఇన్ఫోసిస్ ద్వారా అప్రెంటిస్ అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications