వైసీపీ ప్రభుత్వానికి కొత్త జోష్ - నేడు మరో 248 ఎంఓయూలు..!!

ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ విశాఖ సదస్సు వైసీపీ ప్రభుత్వానికి కొత్త జోష్ ఇచ్చింది.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌. ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఈ సదస్సు వైసీపీ ప్రభుత్వానికి కొత్త జోష్ ఇచ్చింది. ఏకంగా రూ 13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. తొలి రోజున 92 ఒప్పందాల ద్వారా 11.85 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఖరారయ్యాయి. ఈ రోజు రెండో రోజు కూడా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగనున్నాయి. నేడు మరో 248 ఎంఓయూలు చేసుకోనున్నారు. సీఎం జగన్ ముగింపు ప్రసంగంలో కీలక ప్రకటనకు అవకాశం కనిపిస్తోంది. ముగింపు సమావేశానికి కేంద్ర మంత్రులు.. పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు.

సదస్సు సక్సెస్ తో నేతలు హ్యాపీ

సదస్సు సక్సెస్ తో నేతలు హ్యాపీ


ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ అధికార పార్టీ నేతలకు సంతోషాన్ని ఇచ్చింది. తొలి నుంచి ప్రభుత్వంలోని మంత్రులు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తమ టార్గెట్ గా చెబుతూ వచ్చారు. కానీ, ఏకంగా రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ సదస్సు ద్వారా రావటంతో ప్రభుత్వం సక్సెస్ అయిందని అధికార పార్టీ నేతలు హ్యాపీ ఫీలవుతున్నారు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలు తరలి రావటం.. జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించటం కూడా కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. తొలి రోజున ముకేష్ అంబానీ, కరణ్ ఆదానీ, జీఎమ్మార్, భజాంక, పునీత్ దాల్మియా వంటి ప్రముఖులతో పాటుగా మరింత మంది పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. రెండు రోజుల సదస్సులో భాగంగా తొలి రోజు 92 ఒప్పందాలు జరిగాయి. వాటి విలువ రూ 11.85 లక్షల కోట్లు. దాదాపు నాలుగు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుతాయని ప్రభుత్వం ప్రకటించింది.

నేడు మరో 248 ఎంఓయూలు

నేడు మరో 248 ఎంఓయూలు


సదస్సు రెండో రోజున నేడు 248 ఒప్పందాలు జరగనున్నాయి. వీటి ద్వారా మరో 1.15 లక్షల కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. ఈ రెండు రోజుల ఒప్పందాల..పెట్టుబడుల ద్వారా రానున్న రోజుల్లో 20 రంగాల్లో దాదాపుగా 6 లక్షల మందికి ఉపాధి అందుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా విద్యుత్ రంగంలో పెట్టుబడులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిశ్రమలు, ఐటీ, టూరిజం వంటి కీలక రంగాల్లోనూ పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపించారు. ముఖేష్ అంబానీ, కరణ్ ఆదానీ, జీఎమ్మార్, ప్రతీ రెడ్డి వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి నిర్ణయాలను ప్రశంసించారు. కేంద్రం నుంచి అందుతున్న సహకారాన్ని ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం ఈ సదస్సు ద్వారా ఏకంగా రూ 13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు తీసుకురావటం ప్రభుత్వం సక్సెస్ అయినట్లనని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో..సంక్షేమంతో పాటుగా పెట్టబడులు..పారిశ్రామిక రంగాల్లో తమ సామర్ధ్యం చాటుకోగలిగామని వివరిస్తున్నారు.

నేడు సీఎం జగన్ కీలక ప్రసంగం..

నేడు సీఎం జగన్ కీలక ప్రసంగం..


రెండో రోజు సదస్సులో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాలా, రాజీవ్ చంద్రశేఖరన్ హాజరవుతున్నారు. పారిశ్రామిక రంగం నుంచి రెడ్డీస్ లాబోరేటరీ చైర్మన్ సతీష్ రెడ్డి, నోవా ఎయిర్ సీఈఓగజానన నాబర్, అవాడా గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్, లారస్ లాబ్స్ చైర్మన్ సత్యనారాయణ చావా, హెటిరో గ్రూప్స్ ఎండీ వంశీకృష్ణ బండీ, గ్రీన్ కో డైరెక్టర్ అనిల్ కుమార్ చలమలశెట్టి, సెయింట్ గోబైన్ సీఈఓ సంతానం, అపాచి హిల్ టాప్ హెడ్ సెరిగో లీ, బ్లెండ్ హబ్ వ్యవస్థాపకుడు హెన్ రిక్ స్టామ్ , వీస్పన్ గ్రూప్ ఎండీ రాజేష్ మందావే వాలా, భారత్ బయోటెక్ చైర్ పర్సన్ సుచిత్ర ఎల్లా పాల్గొంటారు. సమ్మిట్ ను ఉద్దేశించి నేడు 11 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించనున్నారు. మధ్నాహ్నం ముఖ్యమంత్రి జగన్ ముగింపు ప్రసంగం ఉంటుంది. ఇందులో ఏపీలో పెట్టుబడుల అంశం..భవిష్యత్ ప్రణాళికల పైన ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+