IPS పీఎస్సార్ ఆంజనేయులు రిటైర్మెంట్- ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు (PSR Anjaneyulu) ఈ నెలలో రిటైర్ కాబోతున్నారు. అయితే ఇప్పటికే ఆయనపై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపుల కేసుతో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాల కేసు నడుస్తోంది. ఈ కేసుల్లో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకు రిటైర్మెంట్ లోపు లేదా రిటైర్మెంట్ రోజు అయినా పోస్టింగ్ ఇస్తారా లేదా అన్న దానిపై రాష్ట్ర అధికార వర్గాల్లో సాగుతున్న చర్చకు ప్రభుత్వం (AP Govt) ఇవాళ చెక్ పెట్టింది.

ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులు రిటైర్మెంట్, రిలీవ్ విషయంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31న పీఎస్సార్ ఆంజనేయులుని నిబంధనలకు అనుగుణంగా రిటైర్మెంట్ వేళ రిలీవ్ చేయాలని నిర్ణయించింది. దీంతో రిటైర్మెంట్ కు ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. కాబట్టి సర్వీసులో తిరిగి చేరకుండానే రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. మరోవైపు ఆయన రిటైర్ అయినా పెండింగ్ లో ఉన్న కేసుల్లో దర్యాప్తు మాత్రం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

AP Govt to Relieve IPS Officer PSR Anjaneyulu on Retirement Aug 31 Cases Inquiries to Continue

పీఎస్సార్ ఆంజనేయులుపై ప్రస్తుతం క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఆయనపై ఉన్న పెండింగ్ కేసుల్లో దర్యాప్తు సంస్దలు తమ తదుపరి దర్యాప్తును కొనసాగించబోతున్నాయి. విచారణలకు రిటైర్మెంట్ అడ్డంకి కాదని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అయితే పెన్షన్ ప్రయోజనాలు మాత్రం నిబంధనల ప్రకారం వర్తింప చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ ఆదేశాల మేరకు ఆయన పనిచేశారని, ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించి ప్రత్యర్దుల్ని టార్గెట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైదరాాబాద్ లో జరిగిన పీఎస్సార్ కుమారుడి పెళ్లికి జగన్ హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+