పీఎస్సార్, కాంతిరాణా టాటాపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం- ఉత్తర్వులు..!!
సీనియర్ ఐపీఎస్ అధికారుల పైన ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో కీలక అధికారులుగా పని చేసిన వీరి పైన కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే చర్యలు తీసుకుంది ముంబైకి చెందిన సినీనటి కాదంబరి జెత్వానీపై అక్రమ కేసు బనాయించి ఆమెతో టు కుటుంబ సభ్యులను వేధించిన కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది. కాగా.. ఇప్పుడు ఇదే వ్యవహారంలో ఇద్దరు ఐపీఎస్ అధికారుల పైన కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు నిఘా చీఫ్ గా పని చేసారు. కాంతి రాణా టాటా విజయవాడ సీపీగా వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్యుల ఆదేశాలకు అనుగుణంగా వీరు వ్యవహరించారని కూటమి నేతలు ఆరోపించారు. దీంతో, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముంబైకి చెందిన సినీనటి కాదంబరి జెత్వానీపై అక్రమ కేసు బనాయించి ఆమెతోపాటు కుటుంబ సభ్యులను వేధించిన కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారు ల పైన సస్పెన్షన్ వేటు వేసింది. అదే విధంగా పీఎస్సార్ ఆంజనేయులు జైలుకు వెళ్లారు. అణా రోగ్య కారణాలతో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పైన ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే జెత్వానీ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసారు. కాగా.. వీరి సస్పెన్షన్ పైన గతంలో సమావేశమైన రివ్యూ కమిటీ కేసు దర్యాప్తుపై ఆరా తీసింది. ఇంకా విచారణ పూర్తి కాక పోవటంతో సస్పెన్షన్ ఎత్తేస్తే సీనియర్ ఐపీఎస్ అధికారులు దర్యాప్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది.

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు
దీంతో, 2025 మార్చి 8 వరకూ సస్పెన్షన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో సస్పెండైన మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ తనకు పోస్టింగ్ ఇప్పించాలంటూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇక.. గతంలో రివ్యూ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఆ కాల పరిమితి ముగుస్తుండటంతో మరో సారి వీరి సస్పెన్షన్ ను ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి వీరు సస్పెన్షన్ లోనే ఉన్నారు. అటు విశాల్ గున్నీ ట్రిబ్యునల్ ను ఆశ్ర యించటంతో.. అక్కడ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందనేది కీలకంగా మారుతోంది. కాగా.. ఈ అధికారులు నాడు వైసీపీ ముఖ్య నేతలకు అనుకూలంగా పని చేసారనేది కూటమి నేతల ఆరోపణ. దీంతో.. రానున్న రోజుల్లో వీరి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications