AP SIR: "సర్ " లో ఓటు పోయిందా ? ఇలా చేయండి- ఆగస్టు 30 వరకే..!

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం ( AP SIR)లో ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ముసాయిదా జాబితాల్ని అధికారులు విడుదల చేశారు. ఇందులో లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. పలు చోట్ల పాత ఓట్లతో ప్రస్తుత ఓట్లు మ్యాప్ కాకపోవడంతో బీఎల్వోలు కూడా ఏమీ చేయలేని పరిస్ధితి. దీంతో ఆయా ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోతామనే ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కీలక ప్రకటన చేశారు.

AP SIR: ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కీలక నిర్ణయం-జీవో జారీ..!
AP SIR: ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కీలక నిర్ణయం-జీవో జారీ..!

తాజా సవరణ తర్వాత ఎన్నికల సంఘం విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఏం చేయాలన్న దానిపై ప్రధాన ఎన్నికల అధికారి క్లారిటీ ఇచ్చారు. వీరంతా మూడు విధాలుగా తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందులో ఫామ్ 6 (భారతీయులకు) లేదా ఫామ్ 6ఏ (ఎన్నారైలకు) ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. లేదా సవరణలు, తొలగింపులు, అభ్యంతరాల కోసం ఫామ్ 7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే చిరునామా మార్పు కోసం ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

AP SIR Chief Electoral Officer Urges Voters to Check Draft Rolls Highlights August 30 Deadline
TG SIR:
TG SIR:

అయితే ఇలా దరఖాస్తులు చేసుకునేందుకు ఓటర్లకు ఆగస్టు 30 వరకూ మాత్రమే గడువు ఉంటుందని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ సహా ప్రధాన పార్టీలన్నీ భారీ ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని, ముఖ్యంగా మ్యాపింగ్ లో పేర్లు కనిపించక చాలా మంది తమ ఓట్లు కోల్పోతున్నట్లు ఈసీ దృష్టికి తెచ్చారు. దీంతో వీరంతా మూడు విధాలుగా దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్దాయిలో వివరాలు పరిశీలించి తిరిగి ఓటు హక్కు కల్పిస్తామని ఎన్నికల ప్రధానాధికారి భరోసా కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటే voters.eci.gov.in వెబ్ సైట్ ద్వారా, లేదా ECINET మొబైల్ యాప్ ద్వారా కూడా అవకాశం ఉందని తెలిపారు. ఇలా పూర్తి చేసిన దరఖాస్తుల్ని జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకూ సంబంధిత బీఎల్వోలు లేదా ఈఆర్వోలు, లేదా ఏఈఆర్వోలకు సమర్పించే అవకాశం కల్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+