సంక్రాంతికి కర్చీఫ్ వేసిన శ్రీను వైట్ల: ఆ యంగ్ హీరోతో టీమ్ అప్- వెరైటీ టైటిల్

టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు శ్రీను వైట్ల మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఓ యంగ్ హీరో కాంబినేషన్ లో తనదైన శైలిలో సినిమాను పట్టాలెక్కించారు. దీనికి ముహూర్తం షాట్ కూడా పడింది. పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సినిమా బిగినింగ్ రోజే విడుదల తేదీని కూడా ప్రకటించారు శ్రీను వైట్ల. 2027 జనవరి 14వ తేదీన సంక్రాంతిని పురస్కరించుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోన్నారు.

ఇందులో హీరో.. శర్వానంద్. శర్వాతో సినిమా చేయడం శ్రీను వైట్లకు ఇదే మొదటిసారి. దూకుడు, బాద్ షా తర్వాత ఆ స్థాయి హిట్ పడలేదాయనకు. మహేష్ బాబుతో తీసిన ఆగడు బెడిసికొట్టింది. రామ్ చరణ్ బ్రూస్ లీ, వరుణ్ తేజ్ మిస్టర్, రవి తేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. గోపీచంద్ హీరోగా నిర్మించిన విశ్వం ఫర్వాలేదనిపించుకుంది.

Sharwanand and Srinu Vaitla Team up for Titled George Krish Film set to Releases on January 14 2027

దీని తర్వాత శర్వానంద్ తో టీమ్ అప్ అయ్యాడు శ్రీను వైట్ల. వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైంది. ఈ చిత్రానికి 'జార్జ్ క్రిష్' అనే వెరైటీ టైటిల్‌ పెట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. సినిమా విడుదల తేదీని కూడా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. శర్వానంద్ మార్క్ సెన్సెటివ్ యాక్షన్, శ్రీను వైట్ల మార్క్ కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్: పవర్ ఫుల్ టైటిల్: ఎప్పుడూ చేయని రోల్ లో యంగ్ హీరో
టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్: పవర్ ఫుల్ టైటిల్: ఎప్పుడూ చేయని రోల్ లో యంగ్ హీరో

టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్‌లకు కథా సహకారం అందించిన గోపీ మోహన్‌ ఈ చిత్రానికి రచయిత. ఎన్నో మెలోడీ గీతాలను అందించిన అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేవీ గుహన్ కెమెరా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శ్రీను వైట్ల గత చిత్రాల తరహాలోనే ఇందులోనూ కామెడీ టైమింగ్ హిలేరియస్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

కరికాల ఛాప్టర్ 1.. తెలుగు తెరపై మరో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్.. !!
కరికాల ఛాప్టర్ 1.. తెలుగు తెరపై మరో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్.. !!

టైటిల్ అనౌన్స్ మెంట్ సమయంలోనే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఖరారయ్యారంటే సినిమా కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నైజాం- ఆసియా సురేష్, వైజాగ్- వాసుదేవా మూవీ క్రియేషన్స్, ఈస్ట్- వింటేజ్ క్రియేషన్స్, వెస్ట్- ఆదిత్య ఫిల్మ్స్, కృష్ణా- వ్యోమ్ సినిమాస్, గుంటూరు- ఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్స్, నెల్లూరు- అభి సినిమాస్, సీడెడ్- శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఓవర్సీస్: వ్యోమ్ సినిమాస్ / సినిమా పారాడిసో.. దీన్ని పంపిణీ చేయనున్నారు.

ఇటీవలి కాలంలో క్లీన్ ఫ్యామిలీ కామెడీ సినిమాలకు ఆదరణ బాగా పెరగడంతో, 'జార్జ్ క్రిష్' విజయంపై చిత్ర బృందం ధీమాగా ఉంది. సంక్రాంతి సీజన్ కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు అనువైన సమయం కావడంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని ఆశిస్తోంది. శర్వానంద్ యాక్టింగ్ తోడు శ్రీను వైట్ల మార్క్ కామెడీ మేజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని యూనిట్ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+