Trisha: 11 ఏళ్ల క్రితం త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? ఎంగేజ్మెంట్ రోజున ఏం జరిగిందంటే?

Trisha: చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీ నటుల పర్సనల్ లైఫ్, ముఖ్యంగా వారి పెళ్లికి సంబంధించిన విషయాలపై అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. కొందరు సరైన భాగస్వామి దొరకక, మరికొందరు పెళ్లి బంధానికి కట్టుబడి ఉండలేక సింగిల్ గానే ఉండిపోతుంటారు. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ జరిగిన కూడా పెళ్లి పీటల వరకు వెళ్లకుండా ఆగిపోయిన సినీ ప్రముఖులలో త్రిష ఒకరు. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పెళ్లి రద్దుకు సంబంధించిన పాత విషయాలు, ట్రోలింగ్స్ మళ్లీ నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగా మారాయి.

ప్రముఖ వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్
2014-2015 కాలంలో త్రిష కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని త్రిష స్వయంగా 2015 జనవరిలో అధికారికంగా వెల్లడించారు. కానీ అందరూ పెళ్లి వార్త కోసం ఎదురుచూస్తున్న సమయంలో కొన్ని నెలలకే ఈ ఎంగేజ్మెంట్ రద్దయింది. పెళ్లి తర్వాత త్రిష నటనకు దూరంగా ఉండాలనే కండీషన్‌ను వరుణ్ ఫ్యామిలీ పెట్టడమే దీనికి ప్రధాన కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Why Trisha Krishnan Cancelled Her Wedding Engagement Day Truth Revealed Her Responce to Rumors

ఓ ఇంటర్వ్యూలో త్రిష ఈ విషయంపై స్పందిస్తూ తన మనసులోని మాటను బయటపెట్టారు. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తన యాక్టింగ్ కెరీర్ ను వదిలేయమని కోరారని.. కానీ తన ప్రాణమైన సినిమాలను వదిలేయడానికి సిద్ధంగా లేక ఎంగేజ్మెంట్‌ను రద్దు చేసుకున్నాని వెల్లడించారు. కేవలం గర్భవతిగా ఉన్న సమయంలో మాత్రమే నటనకు విరామం తీసుకుంటానని.. భవిష్యత్తులో లీడ్ రోల్ పాత్రలు రాకపోయినా తన ఇమేజ్ కు తగ్గ క్యారెక్టర్ రోల్స్ చేస్తానని.. చివరి శ్వాస వరకు సినీ ఇండస్ట్రీలోనే ఉంటానని త్రిష స్పష్టం చేశారు.

త్రిషపై అనేక పుకార్లు
గతంలో రానా, ప్రభాస్ వంటి ప్రముఖ నటులతో త్రిష పేరును ముడిపెడుతూ అనేక రూమర్లు వచ్చాయి. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో కూడా పలు పుకార్లు వచ్చాయి. అయితే ఇటువంటి రూమర్లపై త్రిష ఎలాంటి అనవసరమైన గందరగోళానికి గురికాకుండా.. సంయమనంతో వ్యవహరిస్తూ తన నటనపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. 11 ఏళ్ల క్రితం జరగాల్సిన పెళ్లి ఆగిపోయినా.. నటనపై ఉన్న అంకితభావంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయం స్పష్టమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+