NTR అభిమాని కుమారుడికి SVBC ఛైర్మన్ పదవి.. ఉత్తర్వులు జారీ..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నియామకం చేసింది. టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ఛైర్మన్‌గా టీడీపీ స్టేట్ మీడియా కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న శ్రీధర్ వర్మ నియమితులయ్యారు. శ్రీధర్ వర్మ కుటుంబానికి టీడీపీతో, ఎన్టీఆర్ కుటుంబంతో దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన తండ్రి 'ఎన్టీఆర్ రాజు'గా సుపరిచితులు. ఈ మేరకు శ్రీధర్ వర్మ నియామం తో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు అభినందిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది. కాగా, టీటీడీ కార్యక్రమాలను ప్రసారం చేసే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి మాత్రం రెండేళ్ల కాలంగా ఖాళీ గానే ఉంది. ఇప్పుడు ఈ పదవిలో శ్రీధర్ వర్మ నియమితులయ్యారు. ఆయన తండ్రి ఎన్టీఆర్ అభిమాన సంఘాలను నిర్వహించారు. ఎన్టీఆర్ తో సన్నిహితంగా మెలిగి, తిరుపతి టీడీపీలో కీలకంగా పనిచేసిన ఎన్టీయార్ రాజు గతంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. కాగా, ఇప్పుడు శ్రీధర్ వర్మ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా, స్టేట్ మీడియా కో ఆర్డినేటర్‌గా పని చేసారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ ముఖ్యనేతల సమక్షంలో ఈనెల 22వ తేదీన ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఆయన పదవీ బాద్యతలు చేపట్టనున్నారు.

బాధ్యతల స్వీకరణ
టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. శ్రీవారి కార్యక్రమాలతో పాటుగా తిరుమల వైభవం.. టీటీడీ నిర్వహించే కార్యకలాపాలను భక్తుల్లోకి తీసుకెళ్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సేవలు, ఉత్సవాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలను ఈ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు 24 గంటలూ అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పోస్టు ఖాళీగానే ఉండటంతో పలువురి పేర్లను పరిశీలించారు. ఇప్పుడు తాజాగా శ్రీధర్ వర్మను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.













Click it and Unblock the Notifications