KBR Park Traffic: కేబీఆర్ పార్క్ వద్ద మారిన ట్రాఫిక్ రూల్స్.. రాంగ్ రూట్ వెళ్తే కష్టమే!

KBR Park Traffic: హైదరాబాద్‌లోని ప్రముఖ కాసు బ్రహ్మానంద రెడ్డి(కేబీఆర్) పార్క్ చుట్టూ ప్రతిపాదించిన వన్-వే ట్రాఫిక్ విధానం అమలుపై పోలీసులు శుక్రవారం పార్క్ వాకర్లతో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ నేతృత్వంలో జరిగిన ఈ చర్చలో.. రాబోయే రోజుల్లో అమలు చేయనున్న ట్రాఫిక్ ఆంక్షల గురించి వాకర్లకు వివరించారు.

రేపటినుండే స్మార్ట్ రేషన్ కార్డులు.. హోలోగ్రామ్ నుంచి QRకోడ్ వరకు సూపర్ సెక్యూరిటీ!
రేపటినుండే స్మార్ట్ రేషన్ కార్డులు.. హోలోగ్రామ్ నుంచి QRకోడ్ వరకు సూపర్ సెక్యూరిటీ!

ఆగస్టు 18 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు
కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఆగస్టు 18 నుంచి కొత్త ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దాదాపు 18 నెలల పాటు ఈ వన్-వే ట్రాఫిక్ విధానం అమలులో ఉంటుందని పోలీసు యంత్రాంగం ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేసింది. ఈ నూతన ఏర్పాట్లు సజావుగా సాగేందుకు పార్క్ సందర్శకులు, వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

KBR Park One-Way Traffic Restrictions from Aug 18 Hyderabad Police Guidelines Full Details Here

వాకర్లకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు
ఈ సందర్భంగా పార్క్ సందర్శకులు పాటించాల్సిన పలు నిబంధనలను జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ వివరించారు.

*పార్కింగ్: వాహనాలను సందర్శకులు కేవలం నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లో లేదా మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లోనే నిలపాలి.

*రాంగ్ రూట్ డ్రైవింగ్: ముఖ్యంగా ఉదయాన్నే రోడ్లపై రాంగ్ రూట్లో వాహనాలు నడపకూడదు.

పోలీసులకు సహకారం: సవరించిన ట్రాఫిక్ మార్గదర్శకాలను పాటిస్తూ.. అక్కడి ట్రాఫిక్ సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలి.

70 లక్షల ఓట్ల తొలగింపు- రేవంత్ అలర్ట్: కొత్త లెక్కలు..లాభం వారికేనా..!?
70 లక్షల ఓట్ల తొలగింపు- రేవంత్ అలర్ట్: కొత్త లెక్కలు..లాభం వారికేనా..!?

క్యూఆర్ కోడ్ ద్వారా సూచనలు, సలహాలు
ఈ ప్రతిపాదిత మార్పులపై కేబీఆర్ పార్క్ వాకర్ల నుంచి సలహాలు, అభిప్రాయాలను స్వీకరించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. కేబీఆర్ పార్క్ ప్రధాన ద్వారం వద్ద ఓ క్యూఆర్ కోడ్ ను అందుబాటులో ఉంచనున్నారు. దీని ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయవచ్చు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సురక్షితమైన, క్రమబద్ధమైన ట్రాఫిక్ ప్రవాహం కోసం పౌరులందరూ సహకరించాలని అధికారులు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+