గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం కీలక బాధ్యతలు..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ నిర్ణయాలను మార్పు చేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థ పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పెంచిన పెన్షన్లను సచివాయల వాలంటీర్ల ద్వారా పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో జగన్ హాయంలో ప్రారంభించిన వార్డు, గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం కొత్త బాధ్యతలు కేటాయిస్తోంది. ఈ మేరకు తుది కసరత్తు జరుగుతోంది.
ఎన్నికల హామీలపై
టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో కీలక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలు పైన ఆలోచన చేస్తోంది. గత ప్రభుత్వ సహాయంలో సంక్షేమ పథకల అమలు బాధ్యతలను పూర్తిగా సచివాలయాలకు అప్పగించారు. దీంతో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలు బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాలకే అప్పగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుండి అందిన ఆదేశాలతో అధికార యంత్రాంగం కూడా కసరత్తు ప్రారంభించింది.

సచివాలయాలకు బాధ్యతలు
ఒక్కో సచివాలయంలో ఇప్పటికే పది నుంచి 12 మంది వరకు కార్యదర్శులు పనిచేస్తున్నారు. వారికే సూపర్ సిక్స్ పథకాల బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. వీటితోపాటు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిరుద్యోగులను గుర్తించే బాధ్యత కూడా సచివాలయాలకే అప్పగించాలని, లేదా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించే బాధ్యతను వారికి అప్పగించాలని యోచిస్తున్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసేందుకు వీలుగా తుది కసరత్తు జరుగుతోంది.
ప్రభుత్వం కసరత్తు
రాష్ట్ర వ్యాప్తంగా 15 వేలకు పైగా వార్డు, గ్రామ సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా గత ప్రభుత్వం లబ్దిదారుల ఎంపిక, పథకాల నిర్వహణ అమలు చేసింది. ప్రస్తుత ప్రభుత్వంలోనూ వీటి ద్వారా నే లబ్ది దారుల ఎంపిక కొనసాగించటం ద్వారా వివాదాలకు అవకాశం లేకుండా చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రభుత్వానికి చేరవేయటంలో సచివాలయాలదే కీలక పాత్ర గా మారే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా సాధారణ లబ్దిదారులకు సైతం పథకాల దరఖాస్తులు..ఆమోదం వంటి వాటి పై సమాచారం అందుబాటులో ఉండనుంది. దీని పైన ప్రభుత్వం తుది ఆదేశాలు ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications