ఆ నిర్ణయమే కొంప ముంచిందా - టీటీడీ కీలక అధికారిపై వేటు..!?

తిరుపతిలో విషాదం దేశ వ్యాప్తంగా అందరినీ కలిచి వేసింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు టీటీడీ - అధికారుల వైఫల్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వైకుంఠ ద్వార దర్శనం గురించి పదే పదే ప్రచారం కోసం ప్రకటనలు చేసిన ఛైర్మన్.. టీటీడీ ముఖ్య అధికారులు ముందస్తు ఏర్పాట్లలో విఫలమయ్యారు. ఈ ఘటన వేళ ఛైర్మన్ ..టీటీడీ అధికారుల అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపించింది. టోకెన్ ఉంటేనే దర్శనం అనే నిర్ణయం ఈ ఘటనకు కారణం గా భావిస్తున్నారు. టీటీడీ కీలక అధికారి పై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం.

ఘటన వెనుక
తిరుపతిలో జరిగిన విషాదం పైన సాధారణ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం గురించి కొద్ది రోజులుగా టీటీడీ ఛైర్మన్.. ఈవో, అదనపు ఈవో పోటీ పడి మీడియా ముందు కు వచ్చారు. టోకెన్ ఉన్న వారినే దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పుకొచ్చారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య.. జారీ చేయాలని నిర్ణయించిన టోకెన్ల సంఖ్య.. ఈ అంచనాల్లో అధికారుల అనుభవ రాహిత్యం బయట పడింది. అదే విధంగా టోకెన్లు జారీ చేసే కౌంటర్లలో సమయాలు, నిర్వహణ విషయంలోనూ ముందస్తు చర్యలు లేవు. గతంలో ఇదే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేసినా.. ఎక్కడా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. తొక్కిసలాట ఘటనలు ఉన్నాయి.

AP Govt to take serious action against TTD key officials during stampede in Tirupati

కొరవడిన సమన్వయం
ఇక, ఘటన జరిగిన తరువాత పోలీసులు, టీటీడీ యంత్రాంగం అవసరమైన రీతిలో స్పందించ లేదనే విమర్శలు ఉన్నాయి. ఎస్పీ వచ్చే వరకూ డిఎస్పీ సహా స్థానిక పోలీసులు పరిస్థితికి అనుగు ణంగా చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. ఘటనా స్థలికి వచ్చిన ఈవో శ్యమలా రావు స్పందిం చిన విధానం పైన విమర్శలు ఉన్నాయి. ఘటన పై మీడియా ప్రశ్నిస్తుంటే థాంక్యూ చెప్పి వెల్లిపోయారు. ఇక, ఛైర్మన్ ఈ ఘటన పైన స్పందించిన తీరు పైన సోషల్ మీడియాలో విమర్శలు కనిపిస్తున్నాయి. ఛైర్మన్ ఈ ఘటన అధికారులదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ఘటన పైన ప్రభుత్వానికి ప్రాధమిక నివేదిక అందింది.

కీలక అధికారి పై వేటు
ముందు నుంచి ప్రణాళికా బద్దంగా వ్యవహరించక పోవటమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇదే సమయంలో టీటీడీ, ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమన్వయం లోపించింది. దీంతో, నిఘా వర్గాల నుంచి ముఖ్యమంత్రి సమాచారం సేకరించారు. ఈ మధ్నాహ్నం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తిరుపతికి రానున్నారు. బాధితులను పరామర్శించటం తో పాటుగా పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. అదే విధంగా టీటీడీలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి పైన చర్యలకు రంగం సిద్దమైనట్లు చెబుతున్నారు. పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+