రైతులకు పండగ: రైతు భరోసా కింద నగదు బదిలీ చేయనున్న జగన్ సర్కార్

అమరావతి: ఏపీలో రైతులకు శుక్రవారం పండగ రోజు కానుంది. ఏపీ ప్రభుత్వం 49 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5,500 వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద జమచేయనుంది. ఇది తొలి విడతగా జమచేయనుంది. ఎస్సీ ఎస్టీ, బీసీ ఇతర మైనార్టీ వర్గాల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఖరీఫ్ సీజన్‌కు ముందు ఈ డబ్బులు తమ ఖాతాలో పడుబోతున్నాయని తెలుసుకున్న రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక మొత్తం ఏడాదికి గాను రూ.13500 మూడు విడతలుగా ఏపీ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులను వేస్తోంది. తొలి విడత కింద రూ.7500 రెండో ఇన్స్‌టాల్‌మెంట్ కింద రూ.4000 ఇది అక్టోబరులో ఇవ్వడం జరుగుతుండగా మూడో విడత కింద రూ. 2వేలను సంక్రాంతి సమయంలో ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తోంది.

తొలి విడతలో భాగంగా రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ. 3,675 కోట్లు రానున్నాయి. ఇప్పటికే ఏప్రిల్‌ నెలలో రూ. 2వేలు రైతులకు ఇవ్వగా మిగతా రూ.5,500 మే 15న ప్రభుత్వం జమ చేయనుంది. సీఎం జగన్ అధికారంలోకి రాకముందు చేసిన పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన నవరత్నాల్లో భాగం రైతు భరోసా. 2019-20 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం రైతు భరోసా -పీఎం కిసాన్ కార్యక్రమానికి మూడు విడతల్లో రూ.6,534 కోట్లు ఖర్చు చేసింది. ముందుగా ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.12500 నాలుగేళ్ల పాటు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే రైతుల సంక్షేమంను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని రూ.12500 నుంచి రూ.13,500కు పెంచడం జరిగింది. ఇది ఐదేళ్లకు ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

AP govt to transfer cash to the farmers under YSR Raithu Bharosa-PM Scheme on Friday

ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్‌ 1902ను కూడా ప్రవేశపెట్టింది. రైతు సమస్యలు ఏమైనా ఉంటే ఈ నెంబరుకు ఫోన్ చేసి సలహాలు సూచనలు పొందొచ్చని పేర్కొంది. అంతేకాదు రైతుల కోసం 10,641 రైతు భరోసా కేంద్రాలను కూడా గతేడాది మేలో ప్రారంభించింది. వ్యవసాయం వ్యవసాయ ఆధారిత సమస్యలపై సమాచారంను ఈ రైతు భరోసా కేంద్రాల నుంచి పొందొచ్చంటూ ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు పంటకొనుగోలుకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇక్కడ లభ్యం అవుతుంది. రైతు భరోసా కేంద్రాల్లో డిజిటల్ కియోస్క్‌లు స్మార్ట్‌టీవీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం... వ్యవసాయ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది. అంతేకాదు పంట లాభదాయకంగా మార్చుకునేందుకు నిపుణులు మంచి సలహాలు సూచనలు కూడా చేయడం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+