సీఎం జగన్ ఎన్నికల టీం రెడీ - 57 మంది ఐఏఎస్ ల బదిలీ..!!

ఎన్నికల దిశగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ - ప్రభుత్వంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసారు. ఇక, పాలనలో ప్రక్షాళన ప్రారంభించారు. కొద్ది రోజులుగా ఐఏఎస్ - ఐపీఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబందించి సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఇప్పుడు ఏకంగా ఒకే సారి 57 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది జిల్లాల కలెక్టర్లను మార్పు చేసింది. ఇక భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ పై కసరత్తు కొనసాగుతోంది.

అధికార యంత్రాంగంలో మార్పులు : ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో అధికార యంత్రాంగంలో మార్పులు చేసారు. జిల్లా అధికార యంత్రాంగంలో కీలకమైన కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లను భారీగా మార్చారు. విజయనగరం కలెక్టర్‌ ఎ.సూర్యకుమారిని పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా, కర్నూలు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావును పురపాలక శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. అనంతపురం కలెక్టర్‌ నాగలక్ష్మిని విజయనగరం కలెక్టర్‌గా పంపారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న సృజనను కర్నూలు కలెక్టర్‌గా బదిలీ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషాను బాపట్ల కలెక్టర్‌గా నియమించారు. గ్రేటర్ విశాఖ కమిషనర్‌ పి.రాజాబాబును కృష్ణా కలెక్టర్‌గా బదిలీ చేశారు. హైకోర్టు ఆగ్రహానికి గురైన దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ను కార్మిక శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు.

AP Govt transferred

హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ గా సిసోడియా : గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆర్‌పీ సిసోడియాను బాపట్లలోని మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమించారు. గవర్నర్ కార్యదర్శిగా పని చేసిన ఆయనను ప్రభుత్వం బదిలీ చేసి వెయిటింగ్ లో ఉంచింది. ఇప్పుడు ఆయనకు హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్ గా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న ఎస్‌.సత్యనారాయణను నియమించారు. ఆయనే ఆ శాఖ కార్యదర్శిగా కూడా ఉంటారు. కార్మిక శాఖ స్పెషల్‌ సీఎ్‌సగా ఉన్న జి.అనంతరామును మైనారిటీ సంక్షేమ శాఖకు బదిలీచేశారు. జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండీగా ఉన్న బి.శ్రీధర్‌ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శిగా నియమించారు. నెల్లూరు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబును జెన్‌కో ఎండీగా బదిలీ చేశారు. ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ ఎంవీ శేషగిరిబాబును కార్మిక శాఖ కమిషనర్‌గా బదిలీచేశారు. సౌరభ్‌ గౌర్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా నియమించారు.

AP Govt transferred

ఎన్నికల టీం రెడీ.. : ఎన్నికలు షెడ్యూల్ నాటికి ఒకే చోట మూడేళ్లు పని చేసిన అధికారులను మార్పు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండేళ్లుగా ఒకే చోట పని చేసిన అధికారులను మారుస్తూ ప్రభుత్వం నిర్ణక్ష్ం తీసుకుంది. ఈ ఏడాది పాలనా పరంగా కీలక సమయం కావటంతో అధికారుల నియామకంలో భారీ కసరత్తు తరువాత నిర్ణయాలు తీసుకుంది. విభాగాధిపతులు, కార్యదర్శుల స్థాయిలో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే కొన్ని కీలక విభాగాలకు అధికారులను మార్చారు. సీఎం జగన్ అటు రాజకీయంగానూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగటంతో.. ఈ రోజు లేదా రేపు ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్దం అయింది. ఇప్పటికే ఎస్పీ స్థాయి నుంచి ఐజీ ర్యాంకు వరకు బదిలీలు జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో..ప్రభుత్వ ఎన్నికల టీం దాదాపుగా సిద్దం అయినట్లే. ఇక రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+