వైసీపీతో అంటకాగిన పోలీసు అధికారుల పై వేటు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు పోలీసు అధికారుల పైన ఆరోపణలు ఉన్నాయి. నాటి అధికార పార్టీకి అంటకాగారనే ఆరోపణలు ఉన్న అధికారుల పైన కొత్త ప్రభుత్వం వేటు వేసింది. అదే విధంగా టీడీపీ కార్యాలయం పై దాడి ఘటనలోనూ కొందరు పోలీసు అధికారుల పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

అధికారులపై వేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీతో అంట కాగిన పలువురు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. తాడిపత్రి, రాజంపేటలో వైసీపీ కోసం పనిచేసిన డీఎస్పీ చైతన్యను బదిలీ చేశారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాజంపేటకు బదిలీ అయినా కూడా తాడిపత్రికి వచ్చి మరీ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై దాడి చేశారని చైతన్యపై ఆరోపణలు వచ్చాయి. రాజంపేటలో కూడా వైసీపీ కోసం డీఎస్పీ చైతన్య పని చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి. తుళ్ళూరు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ బదిలీ అయ్యారు. పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

AP Govt transfersTadipatri DSP Chaitanya along with other police officers

ప్రభుత్వం చర్యలు
తుళ్ళూరు డీఎస్పీ గా రాజధాని రైతులపై దౌర్జన్యం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. కుప్పం డీఎస్పీ శ్రీనాథ్‌ను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేశారు. ఈ రోజు రేపటిలో భారీగా డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేయనుంది. వైసీపీతో అంట కాగిన వారికి పోస్టింగ్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. శాంతిభద్రతల పరిరక్షణ పేరిట తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి మే నెల 14వ తేదీ అర్ధరాత్రి వెళ్లి డీఎస్సీ చైతన్య వెళ్లారు. అక్కడ ఆయన చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అక్కడ ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ దాసరి కిరణ్‌తోపాటు టీడీపీ కార్యకర్తలను చితకబాదారు.

వైసీపీకి మద్దతుగా
అప్పట్లో ఇదంతా వైసీపీ కావాలని చేయించిందంటూ ప్రచారం జరిగింది. మొత్తానికి చైతన్యపై ఇన్నాళ్లకు బదిలీ వేటు పడింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై నాడు మూకుమ్మడిగా దాడి చేసి విధ్వంసం సృష్టించిన ఘటన వెనుక అడుగడుగునా పోలీసుల వైఫల్యం ఉన్నట్లు విచారణలో స్పష్టమైంది. ఇందుకు బాధ్యులైన అప్పటి మంగళగిరి రూరల్‌ సీఐ భూషణం, ఎస్‌ఐలు లోకేశ్‌, క్రాంతి కిరణ్‌లను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం రేంజ్‌ ఐజీ సర్వశేష్ఠ త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అదేవిధంగా ఈ ఘటనలో అప్పటి మంగళగిరి ఎస్‌ఐలుగా ఉన్న విజయకుమార్‌ రెడ్డి, బి.రమేశ్‌బాబులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+