హిమబిందు హత్య కేసు: హైకోర్టుకు అప్పీల్ చేయాలని ప్రభుత్వ నిర్ణయం

కృష్ణా: విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ భార్య హిమబిందు హత్య కేసులో కిందికోర్టు తీర్పును హైకోర్టులో అప్పీల్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ని ఆదేశిస్తూ జీవో నెం.911ను ప్రభుత్వం జారీ చేసింది.

హిమబిందు కేసును విజయవాడ సెషన్స్‌ కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. విజయవాడలోని పడమటకు చెందిన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ మోదమూడి సాయిరాం భార్య హిమబిందు (43) 2014, మార్చి 15న అదృశ్యమయ్యారు. మార్చి 17వ తేదీ రాత్రి ఆమె మృతదేహం కంకిపాడు వద్ద బందరు కాలువలో లభ్యమైంది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరుగురిపై పోలీసులు అభియోగాలు మోపారు.

AP Govt. wants to appeal to High Court on Himabindu murder

నిందితులు మహ్మద్ సుభానీ(27), గోపీకృష్ణ(25)లను మీడియా ముందు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ డిసిపి ఎం రవిప్రకాష్ చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్యాంకు మేనేజర్ సాయిరాం నివాసం ఉండే అపార్టుమెంటు యజమానికి సుభానీ కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు.

గోపీకృష్ణ గతంలో డ్రైవర్‌గా పని చేశాడు. హిమబిందు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, నల్లా మరమ్మతు చేస్తామంటూ వారిద్దరూ లోనికి చొరబడ్డారు. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారు. వారితోపాటు వచ్చిన మరో నలుగురు కూడా ఆమెపై ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను గొంతు నులిమి చంపేశారు.

శవాన్ని ఖాళీగా ఉన్న పక్క ఫ్లాటులోకి తీసుకెళ్లి దాచేశారు. కాగా, సాయిరాం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా భార్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నిందితులు బాధిరాలి ఫోన్ ద్వారా సాయిరాంకు, పోలీసులకు ఫోన్ చేసి ఆమెను తమతోపాటు తీసుకెళ్తున్నామని చెప్పారు. దీంతో పోలీసులు ఆ సెల్‌ఫోన్‌పై నిఘా పెట్టారు.

మార్చి 17వ తేదీ తెల్లవారుజామున దుండుగులు ఆమె మృతదేహాన్ని బందరు కాలువలో పడేశారు. అయితే, పోలీసులు సరైన సాక్ష్యాలను సమర్పించలేదంటూ కేసును సెషన్స్ కోర్టు కొట్టేసింది. పోలీసులు చెప్పిన వివరాలు కల్పిత కథలాగా ఉన్నాయని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+