ఏబీ వెంకటేశ్వరరావు పై చంద్రబాబు కీలక నిర్ణయం..!!

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వం నమోదు చేసిన రెండు కేసుల నుంచి విముక్తి కలిగింది. వైసీపీ హాయంలో ఏబీ కేసులు .. సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. పదవీ విరమణ రోజున పోస్టింగ్...అదే రోజున రిటైర్మెంట్ జరిగింది. ఇక, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఏబీ పైన నమోదైన రెండు కేసులను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో కేసు పైనా చంద్రబాబు నిర్ణయం కోసం సిద్దంగా ఉంది.

ప్రభుత్వం కీలక నిర్ణయం
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు పైన ఉన్న రెండు కేసులను ప్రభుత్వం ఉప సంహరించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2014-19 కాలంలో నిఘా చీఫ్ గా నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ఏబీ వేంకటేశ్వర రావు పని చేసారు. ఆ సమయంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ జగన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఏబీవీని సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయాలంటూ కేంద్రానికి ప్రతిపాదించింది. 2019 నుంచి ఐదేళ్ల పాటు ఏబీవీ సస్పెన్షన్లు, కేసులు, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నారు.

AP Govt withdraws Cases against Rtd IPS AB Venkatewara Rao

వైసీపీ ప్రభుత్వంలో
కాగా, ఏబీ వెంకటేశ్వర రావు సరిగ్గా పదవీ విరమణకు ఒక్కరోజు ముందు నాటి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. క్యాట్‌ ఆదేశాల మేరకు ఈ ఏడాది మే 30న ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించి ఆ మరుసటి రోజు 31న రిటైరయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తన పైన తప్పుడు కేసులు నమోదు చేసారని..వాటిని పరిశీలించి ఉప సంహరించుకోవాలని ఏబీవీ కోరారు. అప్పట్లో కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఆర్‌పీ సిసోడియా ముందు హాజరైన ఏబీవీ... తనను కుట్రపూరితంగా ఇరికించేందుకు ఎవరెవరు ఫోర్జరీ పత్రాలు సృష్టించారో వివరించారు. ఆలిండియా సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించలేదని స్పష్టం చేశారు.

కేసుల విత్ డ్రా
ఏబీవీకి గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన రెండు చార్జి మెమోలను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సర్వీసు నిబంధనల ప్రకారం గత ప్రభుత్వం విచారణ అధికారిని నియమించకుండా కాలయాపన చేసింది. వాటిని జారీచేసి ఏడాది పూర్తికావడంతో ఆ ఉత్వర్వులు నిరర్ధకంగా మారుతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చార్జిమెమోలను ఉపసంహరించు కోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో విచారణ అధికారి ముందు ఏబీవీ ఇచ్చిన వివరణ తో నాటి ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. ఫలితంగా క్రమ శిక్షణా చర్యలకు సిద్దమైంది. ఇక, ఇప్పుడు ప్రభుత్వం ఏబీవీకి ఆ కేసుల నుంచి విముక్తి కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+