సీఎం జగన్ కు రిలీఫ్-కర్నూల్లోనే హెచ్చార్సీ : ప్రభుత్వ అధికారమేనన్న హైకోర్టు..!!
ఏపీ లో జగన్ ప్రభుత్వం నిర్ణయించిన మూడు రాజధానుల అమలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత 2019 డిసెంబర్ లో అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల అంశాన్ని ప్రకటించారు. ఆ తరువాత అమరావతి ఉద్యమంతో పాటుగా న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయి. కరోనా కారణంగా కేసుల విచారణ ఆలస్యమైంది. తాజాగా రోజు వారీ విచారణ చేపడతామని చెప్పినా.. ఈ పెల 23న ప్రారంభమైన విచారణ నవంబర్ 15కు వాయిదా పడింది. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి సీనియర్ మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు చేసారు.

మూడు రాజధానులపై ప్రభుత్వ తాజా వాదన..
కొద్ది రోజుల క్రితం వరకు చట్ట సభల్లో మూడు రాజధానుల బిల్లుల ఆమోదంతోనే ప్రక్రియ ఆరంభమైందని..విశాఖ నుంచి ఎప్పుడైనా పాలన ప్రారంభమవుతుందని చెప్పిన వారిలో కొద్దిగా మార్పు కనిపిస్తోంది. న్యాయ పరంగా ఒప్పించే తాము మూడు రాజధానుల విషయం లో ముందుకు వెళ్తామంటూ తాజాగా చెబుతున్నారు. ఇక, మూడు రాజధానుల్లో భాగంగా విశాఖలో పరి పాలనా రాజధాని..కర్నూలులో న్యాయ రాజధాని- అమరావతిలో శాసన రాజధాని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా..కర్నూలుకు హైకోర్టు తరలించాలనేది ప్రభుత్వ ఆలోచన.

కర్నూలులో న్యాయ రాజధాని కోసం కేంద్రాన్ని..
దీని పైన కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నుంచి వినతులు వెళ్లాయి. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన సమయంలోనూ దీని పైన అప్పటి న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ను కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, దీని పైన పార్లమెంట్ లో ఏపీ సభ్యులు హైకోర్టు తరలింపు స్టేటస్ పైన కేంద్రం నుంచి సమాధానం కోరారు. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి వినతి వచ్చిందని..అయితే, ఆ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం - హైకోర్టు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అందుకు సంబంధించి అవసరమయ్యే ఖర్చులను సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

ఏపీలో హెచ్చార్సీ ఏర్పాటు-గజెట్ విడుదల
ఇక, ఇదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వేదికగా పని చేసిన మానవ హక్కుల సంఘం (హెచ్చార్సీ), లోకాయుక్త వంటి కార్యాలయాను న్యాయ రాజధాని కర్నూలుకు తరలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు సైతం వాటిని ఏపీలో ఏర్పాటు చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. దీంతో..మూడు రాజధానుల వ్యాజ్యాల్లో భాగంగా..వాటిని కర్నూలు లో ఏర్పాటు సరి కాదంటూ పిటీషన్లు దాఖలయ్యాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా హైకోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించింది. ఇదే సమయంలో తాజాగా గజెట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది.

కర్నూలు కేంద్రంగా ఏర్పాటుకు నిర్ణయం
కర్నూలు కేంద్రంగా ఏపీలో నూతన హెచ్చార్సీ ఏర్పాటు చేస్తున్నట్లుగా అందులో పేర్కొంది. కేబినెట్ లో ఆమోదించిన విధంగా కర్నూలులో హెచ్చార్సీ ఏర్పాటు చేస్తున్నట్లుగా హైకోర్టుకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ నివేదించారు. హెచ్చార్సీ కోసం రెండు ప్రాంగణాలు చూసామని..పురోగతిని తెలియచేయటానికి నెల రోజులు వాయిదా వేయాలని కోరారు. దీనికి పిటీషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కర్నూలులో ఏర్పాటు చేయటం వలన ప్రజలకు దూరం అవుతుందని వివరించారు.
Recommended Video

ప్రభుత్వ అధికారమని తేల్చిన హైకోర్టు..
దీనికి స్పందించిన న్యాయస్థానం తాము గతంలోనే తెలంగాణలో ఉన్న హెచ్చార్సీని ఏపీలో ఏర్పాటు చేయాలని ఆదేశించామని..ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ప్రభుత్వ అధికారమని స్పష్టం చేసింది. దీంతో..తొలిగా కర్నూలు కేంద్రంగా హెచ్చార్సీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది. ఇది..ఒక రకంగా జగన్ ప్రభుత్వానికి రిలీఫ్ గా చెప్పుకోవచ్చు. తాము అనుకుంటున్న విధంగా న్యాయ రాజధానిలో హైకోర్టు తరలింపు పైన న్యాయ పరంగా వచ్చే ఆదేశాలను అమలు చేయాల్సి ఉండగా.. ముందుగా హెచ్చార్సీ ఏర్పాటు ప్రభుత్వానికి ఉపశమనంగా కనిపిస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications