చంద్రబాబుకు భారీ షాక్, బెయిల్ పిటీషన్లు డిస్మిస్ - వాట్ నెక్స్ట్..!!
ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో వరుస పిటీషన్లు దాఖలు చేసారు. వీటి పైన విచారణ పూర్తి చేసిన హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది.
అంగళ్లు కేసుతో పాటుగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు...ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. అటు చంద్రబాబు క్వాష్ పిటీషన్ పైన కాసేపట్లో సుప్రీంకోర్టు లో విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టులో కస్టడీ..స్కిల్ కేసులో బెయిల్ పైన నిర్ణయం వెలువడ నుంది.
ఈ సమయంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్లను హైకోర్టు తిరస్కరించటంతో ఇప్పుడు సీఐడీ ఏం చేస్తుందీ..చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏం చేస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది.

చంద్రబాబుకు ఎదురు దెబ్బ
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఫబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరించిన హైకోర్టు.. ఇన్నర్‌రింగ్ రోడ్, అంగుళ్ల కేసుల్లో బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ రోజు చంద్రబాబు కేసుల్లో కీలకంగా మారింది. చంద్రబాబు పైన నమోదైన స్కిల్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. నేటితో చంద్రబాబు అరెస్ట్ అయి నెల రోజులు పూర్తయింది. అటు స్కిల్ స్కాంలో సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ పైన నేడు విచారణ జరగనుంది. తీర్పు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇటు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్లను కోర్టు తిరస్కరించింది.
బెయిల్ పిటీషన్ల తిరస్కరణ
ఇటు సుప్రీంలో క్వాష్ పిటీషన్ విచారణ ఉండటంతో ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైన, సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పైన తీర్పులను మధ్నాహ్నం లంచ్ తరువాత వెలువడనున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR), ఫైబర్‌నెట్, అంగళ్లు ఘటనలకు సంబంధించి హైకోర్టులో చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి డిస్మిస్ చేస్తూ తీర్పు వెల్లడించారు. ముందస్తు బెయిల్ పిటీషన్ల పైన విచారణ సమయంలో అటు ప్రభుత్వం..ఇటు చంద్రబాబు తరపు న్యాయవాదుల మధ్య హోరా హోరీగా వాదనలు జరిగాయి. అంగళ్లు కేసులో ఈ మధ్య కాలంలోనే పలువురికి బెయిల్ మంజూరు అయింది.
సుప్రీం నిర్ణయం పై ఉత్కంఠ
ఇక, ఇప్పుడు హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించటంటో చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకు వెళ్తారా..లేక ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. సుప్రీంలో క్వాష్ పిటీషన్ పైన జరిగిన తొలి విచారణలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 (ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే విషయంపై ప్రధానంగా వాదనలు జరిగాయి. ఈ రోజు ఇదే అంశం పైన కోర్టు నిర్ణయం వెల్లడయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అదే విధంగా మధ్నాహ్నం ఏసీబీ కోర్టులో బెయిల్ తో పాటుగా కస్టడీ పిటీషన్ల పైన ఏసీబీ కోర్టు వెలువరించనున్న తీర్పు పైన ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో, హైకోర్టులో పిటీషన్ల పైన క్లారిటీ రావటంతో ఇక సుప్రీంలో..ఇటు ఏసీబీ కోర్టులో వచ్చే తీర్పు పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications