Nara Lokesh:లోకేశ్‌కు దక్కని రిలీఫ్, హైకోర్టు కీలక ఆదేశాలు - ఢిల్లీకి సీఐడీ టీం..!!
నారా లోకేశ్ కు హైకోర్టులో రిలీఫ్ దక్కలేదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడు కేసులో సీఐడీ లోకేశ్ ను ఏ 14గా చేర్చింది. దీంతో, లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణ చేసిన హైకోర్టు విచారణ ముగించింది. సీఐడీ విచరణకు సహకరించాలని లోకేశ్ కు సూచించింది. సీఆర్పీసీ 41ఏ ప్రకారం లోకేశ్ కు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారు. సీఐడీ టీం లోకేశ్ కు నోటీసులు ఇవ్వటానికి రంగం సిద్దమైంది.
హైకోర్టు ఆదేశం : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేశ్ దాఖలు చేసిన పిటీషన్ పైన హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేశ్ కోర్టును అభ్యర్దించారు. ఈ కేసులో పరిణామాలను ఏపీ అడ్వకేట్ జనరల్ వివరించారు. ఈ కేసులో లోకేశ్ కు సంబందం లేదని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. సీఐడీ ఏ 14గా లోకేశ్ పేరు చేర్చటంతో విచారణ చేయాల్సి ఉందని ఏజీ కోర్టుకు నివేదించారు. ఈ సమయంలోనే సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు ఇస్తామని..నిబంధనల మేరకే విచారణ ఉంటుందని స్పష్టం చేసారు. దీంతో, కోర్టు లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని సూచించింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని న్యాయస్థానం లోకేశ్ కు సూచించింది.

సీఐడీ నోటీసులు : హైకోర్టులో జరిగిన వాదనలతో ఇప్పడు సీఐడీ టీం కాసేపట్లో లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. ఆ నోటీసులో ఎప్పుడు విచారణకు రావాలనేది స్పష్టం చేయనున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో లోకేశ్ లబ్ది పొందినట్లుగా సీఐడీ కోర్టులో వాదనలు వినిపించింది. చంద్రబాబు అరెస్ట్ తరువాత నుంచి లోకేశ్ ఢిల్లీలో ఉంటున్నారు. అక్కడ చంద్రబాబు కేసు వ్యవహారాలతో పాటుగా సీఐడీ తన తండ్రి పైన నమోదు చేసిన కేసు గురించి జాతీయ స్థాయిలో వివరిస్తున్నారు. వాస్తవంగా ఈ రోజు రాత్రి నుంచి లోకేశ్ యువగళం యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, అక్టోబర్ న సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణకు రానుంది. ఇదే సమయంలో సీఐడీ లోకేశ్ పేరును అమరావతి కేసులో ఏ14గా చేర్చింది. దీంతో యువగళం యాత్ర వాయిదా వేసుకున్నారు.

మారుతున్న పరిణామాలు : ఇప్పుడు హైకోర్టు విచారణకు సహకరించాలని లోకేశ్ కు ఆదేశించటంతో...నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే ఢిల్లీలో సీఐడీ టీంలు మొహరించాయి. ఈ కేసులో సీఐడీ నోటీసులతో లోకేశ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఎన్ని రోజుల్లోగా విచారణకు రావాలని చెబుతారనేది ఇప్పుడు కీలకంగా మారనుంది. అటు చంద్రబాబు కేసులు సుప్రీంలో, హైకోర్టులో ముందస్తు బెయిల్, ఏసీబీ కోర్టులో కస్డటీ..బెయిల్ పిటీషన్ల పైన విచారణ జరగాల్సి ఉంది. ఈ సమయంలో లోకేశ్ ను సైతం విచారణకు హాజరవ్వాలంటూ సీఐడీ నోటీసులు..తాజాగా హైకోర్టు మార్గదర్శకాలతో ఈ మొత్తం పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications