టీటీడీ బోర్డులో నేరచరిత్ర ఉన్నవారు సభ్యులుగానా?: ఏపీ హైకోర్టు ఆగ్రహం

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో నేర చరిత్ర ఉన్నవారి నియామకంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ పాలకమండలి నియామకాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.

పిటిషనర్ తరపున న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. ఎంసీఐ మాజీ ఛైర్మన్ డాక్టర్ కేతన్ దేశాయ్ నియామకంపై అశ్వినికుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీటీడీ కార్యనిర్వాహణాధికారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు మొత్తం 18 మంది సభ్యులకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు వారిని ఆదేశించింది.

ap high court fires on ttd board for appointing members with a criminal history.

కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నెలలో టీటీడీ పాలకమండలిని నియమించిన విషయం తెలిసిందే. టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశమివ్వడంతోపాటు.. పలువురిని బోర్డు సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది.

ప్రభుత్వం కేతన్ దేశాయిని పాలక మండలి సభ్యుడిగా నియమించడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ టీటీడీ కార్య నిర్వహణాధికారికి నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. దీనిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో నేర చరిత్ర ఉన్నవారిని నియమించారంటూ గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రీవారికి 3.604 కేజీల బంగారు బిస్కెట్లు విరాళం

కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు బుధవారం తిరుమల శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు.

శ్రీవారిని దర్శించుకున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు

మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, కాఫీ టేబుల్ బుక్, 2022 డైరీ, క్యాలెండర్ అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+