త్వరలో మూడు రాజధానులు కొలిక్కి- ఎల్లుండి నుంచి హైకోర్టు విచారణ-ఇక ఫాస్ట్ ట్రాక్
ఏపీలో మూడు రాజధానుల్ని ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు, వాటిని గవర్నర్ ఆమోదించిన విధానంపై దాఖలైన వందకు పైగా పిటిషన్లు మరోసారి హైకోర్టు ముందుకు రాబోతున్నాయి. వీటిపై మరోసారి విచారణ జరపాలని నిర్ణయించిన హైకోర్టు.. ఇందుకోసం ఫుల్ బెంచ్ ను సైతం ఏర్పాటు చేసింది. ఎల్లుుండి నుంచి రెగ్యులర్ విచారణ కూడా ప్రారంభం కాబోతోంది. గతంలో ఓసారి ప్రారంభమై నిలిచిపోయిన ఈ విచారణ మళ్లీ మొదటి నుంచి ప్రారంభం కాబోతుండటం ఇక్కడ విశేషం. ఇందుకోసం ఫుల్ బెంచ్ ఏర్పాటుతో హైకోర్టు కూడా దీన్ని సీరియస్ గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.

తేలని మూడు రాజధానులు
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం 2019 డిసెంబర్ లో వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2020 జనవరిలో అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన రెండు బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంది. అయితే మండలిలో మాత్రం వీటికి ఆమోదం లభించలేదు. మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపడంతో ప్రభుత్వం తన అధికారబలంతో వాటిని అడ్డుకుంది.
దీంతో గతేడాది జూన్ లో మరోసారి అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఈ బిల్లుల్ని ఆమోదించింది. మండలి తిరస్కరించిందన్న కారణంతో వాటిని ఆమోదించిన ప్రభుత్వం తిరిగి మండలిలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించి భంగపడింది. అయితే మండలి ఆమోదం తెలపకపోయినా గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో వీటిపై గెజిట్ నోటిపికేషన్లు కూడా వెలువడ్డాయి. దీంతో మూడు రాజధానుల బిల్లుల ఆమోదంలో లోపాల్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

రాజధానులపై హైకోర్టు విచారణ
మూడు రాజధానుల బిల్లుల్ని తన అధికార బలంతో చట్టాలుగా మార్చిన వైసీపీ సర్కార్ కు న్యాయవ్యవస్ధ రూపంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. రాజధానుల బిల్లుల ఆమోదాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాదాపు వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని హైకోర్టు రెండు రకాలుగా విభజించి గతేడాది విచారణ ప్రారంభించింది. అయితే ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటితో మూడు రాజధానులపై సస్పెన్స్ మరింత పెరిగింది.

రాజధానులకు కేంద్రం పరోక్ష మద్దతు
ఏపీలో గతంలో ప్రధాని మోడీ శంఖుస్దాపన చేసిన అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానుల ఏర్పాటుకు వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం ఉంటుందా లేదా అన్న చర్చ మధ్య కీలక నిర్ణయం వెలువడింది. హైకోర్టులో మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ సందర్భఁగా కేద్రం దాఖలు చేసిన అఫిడవిట్ లో రాజధానుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని, దీంతో తమకెంలాంటి సంబంధం లేదని తేల్చేసింది.
దీంతో మూడు రాజధానులకు కేంద్రం పరోక్షంగా మద్దతు తెలిపినట్లయింది. ఈ అఫిడవిట్ తర్వాత మూడు రాజధానుల వ్యవహారానికి ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.

సీజే బదిలీతో విచారణకు బ్రేక్
మరికొన్ని రోజుల్లో మూడు రాజధానులపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయి కీలక నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో గతేడాది నవంబర్ లో హైకోర్టు ఛీప్ జస్టిస్ గా ఉన్న జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో ఆయన నేతృత్వంలోని ప్రధాన ధర్మాసనం విచారిస్తున్న మూడు రాజధానుల పిటిషన్ల విచారణ అర్దాంతరంగా నిలిచిపోయింది.
ఆయన స్ధానంలో సీజేగా వచ్చిన జస్టిస్ అరూప్ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభిస్తుందని అంతా భావించినా ఇప్పటివరకూ అలాంటి నిర్ణయమేదీ వెలువడలేదు. దీంతో రాజధానుల వ్యవహారం ఇంక అటకెక్కినట్లేనని అంతా భావించారు. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఎదురైంది.

మళ్లీ రాజధానుల విచారణ
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నాల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన వందకు పైగా పిటిషన్లపై విచారణను తిరిగి ప్రారంభించాలని ఛీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫుల్ బెంచ్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ బెంచ్.. రాజధాని పిటిషన్లపై విచారణను సోమవారం నుంచి ప్రారంభించబోతోంది.
అంటే ఈ విచారణ తిరిగి మొదటి నుంచి ప్రారంభమవుతున్నట్లే. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం, ఈ పిటిషన్లలో భాగస్వాములుగా ఉన్న వారంతా తిరిగి అఫిడవిట్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. వీటిపై హైకోర్టు తీసుకునే నిర్ణయాలు, వేసే ప్రశ్నలు, పిటిషనర్లు, ప్రతివాదులు వ్యక్తం చేసే అబిప్రాయాలూ.. ఇలా ప్రతీ అంశం ఆసక్తి రేపబోతున్నాయి.
Recommended Video

రాజధానుల్ని హైకోర్టు తేల్చేస్తుందా ?
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సోమవారం నుంచి రెగ్యులర్ విచారణ ప్రారంభించబోతున్న హైకోర్టు.. సాధ్యమైనంత త్వరగా దీన్ని తేల్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ సర్కార్ కూడా అదే కోరుకుంటోంది. రెండేళ్లుగా కోర్టుల్లో నలుగుతున్న ఈ వ్యవహారంతో రాజధానుల తరలింపులో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా సీఎం జగన్ క్యాంపు కార్యాలయం తరలింపు కూడా సాధ్యం కాలేదు. దీంతో మూడు రాజధానుల వ్యవహారం హైకోర్టు ఎంత త్వరగా తేలిస్తే అంత మంచిందని ప్రభుత్వం భావిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు రాజధానుల వ్యవహారం తేలిపోతే విశాఖతో పాటు కర్నూలుకూ రాజధానుల తరలింపు చేపట్టేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతుంది.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..












Click it and Unblock the Notifications