సజ్జలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ - పోలీసులకు నోటీసులు..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, పార్టీ సోషల్ మీడియా సమన్వయకర్త కూడా అయిన సజ్జల భార్గవ్ రెడ్డికి ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా 9 కేసులు నమోదయ్యాయి. వీటిని క్వాష్ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.

గత వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియా కంటెంట్ ఇచ్చి వివిధ సోషల్ ప్లాట్ ఫామ్స్ లో పోస్టులు పెట్టించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల భార్గవ్ రెడ్డి తనపై నమోదైన 9 కేసుల్ని కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది.

ap high court gives two week relief to sajjala Bhargav reddy from arrest in social media cases

అదే సమయంలో సజ్జల భార్గవ్ రెడ్డికి అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్ పై విచారణ ఆలస్యం అయితే పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భార్గవ్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో పోలీసుల వివరణ వచ్చే లోపు సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టు కాకుండా రెండు వారాల పాటు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆలోపు తమ కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వర్రా రవీందర్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇచ్చిన వాంగ్మూలను కోర్టుకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+