వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గణేశ్ ఉత్సవాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్-ఐదుగురికే అనుమతి-కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా సమయంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడిపోయింది. కరోనా నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల అమల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. అయితే దీనిపై విపక్ష బీజేపీ, టీడీపీ ప్రభుత్వాన్ని కొన్ని రోజులుగా టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఎదురుదాడికి దిగుతోంది. అయితే గణేశ్ ఉత్సవాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

SamanthaAkkineni: స్మైలీ బ్యూటీ సామ్ ఇంట హాట్ గా ఎపుడు చూసి ఉండరు (ఫొటోస్)

ఏపీలో గణేశ్ ఉత్సవాలకు అనుమతి మంజూరు చేసిన హైకోర్టు కొన్ని షరతులు విధించింది. పరిమితమైన సంఖ్యతో ఈ ఉత్సవాలు నిర్వహణకు అభ్యంతరాల్లేవని ప్రకటించింది. గణేశ్ మండపాల వద్ద కరోనా నిబంధనలకు లోబడి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్ధించిన హైకోర్టు.. నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

ap high court green signal to ganesh chaturthi celebrations with five people only

ఏపీలో బహిరంగ స్ధలాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేయడంపై హైకోర్టు కూడా ఆంక్షలు విధించింది. అయితే ప్రైవేటు స్ధలాల్లో మాత్రం ఉత్సవాలు పరిమిత భక్తులతో నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీంతో ఇప్పటివరకూ పూర్తిగా కొనసాగుతున్న ఆంక్షలపై కొంత ఊరట దక్కినట్లయింది. అయితే కోవిడ్ ధర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. దీనిపై బీజేపీ, టీడీపీ సహా విపక్షాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. సినిమా హాళ్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం గణేశ్ మండపాలపై ఆంక్షలు విధించడంపై జనం మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు వారికి కాస్త ఊరటనిచ్చేలా ఉన్నాయి.

ఏపీలో గణేశ్ ఉత్సవాల వ్యవహారంపై కొన్నిరోజులుగా రచ్చ జరుగుతోంది. విపక్షాలు పదే పదే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో కోవిడ్ నిబంధనలు విధించిన కేంద్రాన్ని నిలదీయకుండా తమను తప్పుబట్టడం సరికాదని ప్రభుత్వ పెద్దలు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నా ఫలితం లేకపోవడంతో బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయినా పూర్తి స్ధాయిలో ఆంక్షల సడలింపుకు హైకోర్టు కూడా ఆంగీకరించలేదు. కానీ ఐదుగురిని మాత్రం అనుమతిస్తామని చెప్పడంతో ఆ మేరకు గణేశ్ మండపాల్లో ఉత్సవాల నిర్వహణకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.

English summary
andhrapradesh high court on today allows ganesh chaturthi celerbrations in the state with certain limitations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X