రఘురామ వ్యాజ్యంలో సీబీఐ -కేంద్రానికి హైకోర్టు నోటీసులు..!!
ఎంపీ రఘురామ కస్టడిలో సీఐడి హింసించిందంటూ దాఖలు చేసిన కేసులో కేంద్రం, సీబీఐకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఏపీ సీఐడి పోలీసులు తననను చిత్రహింసకు గురి చేసారని.. సీబీఐ విచారణ జరిపించాలంటూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. దీని పైన కేంద్ర హోం శాఖకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తనను అక్రమంగా అరెస్ట్ చేసి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసారని రఘురామ తన పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) చేత దర్యాప్తు చేయించాలని, ఈ దర్యాప్తును స్వయంగా హైకోర్టే పర్యవేక్షించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా బాధ్యులైన అధికారులపై సంబంధిత కోర్టు క్రిమినల్ చర్యలు ప్రారంభించేలా ఆదేశించాలని అభ్యర్ధించారు.
విచారణలో భాగంగా ఎంపీ రఘురామ తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పిటీషన్ దాఖలు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించటంతో రఘురామ పై కక్షగట్టి తప్పుడు కేసులతో అరెస్ట్ చేసారని కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో అరెస్టు చేసిన సీఐడీ.. ఆయనను కస్టడీలో తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. ఈ ఘటనపై దర్యాప్తు నిమిత్తం సంబంధిత హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించాం'' అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ తరఫు న్యాయవాది స్పందించారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను పిటిషనర్ తన వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చలేదని తెలిపారు. దీనిపై రఘురామ తరఫు సీనియర్ న్యాయవాది స్పందిస్తూ ఎఫ్‌ఐఆర్, దర్యాప్తు దశలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి వాదనలు వినాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులు ఎవరని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన న్యాయవాది సీఐడీ ఆరోపణలు ఎదుర్కోంటోందని సమాధానం ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంగా అభివర్ణించారు. అందువలనే వారిని పార్టీగా చేర్చ లేదని వివరించారు. దీంత..రెండు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసారు. కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసారు.












Click it and Unblock the Notifications