పూర్తిగా TTD బోర్డుదే బాధ్యత - హైకోర్టు కీలక ఆదేశాలు..!!

తిరుమలలో ఏం జరిగినా భక్తుల మనోభావాల పైన ప్రభావం ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. బోర్డు సభ్యులు.. అధికారులు తిరుమలలో పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసింది. తిరుమల పరకామణి విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కానుల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళించాలని ధర్మాసనం ఆదేశించింది. పరకామణిలో ఏఐ వినియోగం పెంచాలని సూచన చేసింది. ఇదే సమయంలో బోర్డు సభ్యులు బాధ్యత తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

తిరుమల పరకామణిలో చోరీకి సంబంధించి ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా టీటీడీకి హైకోర్టు ముఖ్య సూచనలు చేసింది. దొంగతనాలను అరికట్టేందు కు రెండు దశలలో సంస్కరణలు చేపట్టాలని సూచించింది. కానుకల లెక్కింపులో మానవ ప్రమే యాన్ని తగ్గించి ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అత్యాధునిక యంత్రాలను వినియోగించాలని టీటీడీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం తక్షణ, శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని టీటీడీకి ఆదేశించింది. హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టాల్సిన భద్రతా చర్యలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇరువురు న్యాయవాదులకు సూచించింది.

ap-high-court-key-orders-over-parakamani-theft-case-details-here

ఈ వ్యవహారంలో శాశ్వత సంస్కరణలో భాగంగా కానుకలను వర్గీకరించడం, విదేశీ కరెన్సీని గుర్తించేందుకు ఏఐను ఉపయోగించడం, విలువైన లోహాలను వేరు చేసే అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దీనిపై ఎనిమిది వారాల్లోపు ముసాయిదా రూపొందించి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. నిందితుడు రవికుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తుల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ల వివరాలను సీల్డ్ కవర్లో వారంలోపు తమ ముందు ఉంచాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 26కు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. దీంతో.. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాల మేరకు టీటీడీ ప్లాన్ -బీ సిద్దం చేసి.. తమ ప్రతిపాదనలను కోర్టు ముందు ప్రతిపాదించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+