వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
ఏపీలో వైసీపీ కార్యాలయాల కూల్చివేత పైన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పలు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణాల పైన వివాదం మొదలైంది. సీఆర్డీఏ పరిధిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తున్నారనే కారణంతో కూల్చివేసారు. జిల్లాల్లోని కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు. దీంతో, దీని పైన వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలో వైసీపీ అక్రమంగా పార్టీ కార్యాలయాలు నిర్మిచిందంటూ ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 చోట్లు నోటీసులు జారీ అయ్యాయి. అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ స్థలాల్లో నిబంధనలను అతిక్రమణలు..కొన్ని చోట్ల ఆక్రమణలతో నిర్మాణాలు చేస్తుందని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలోనే ఆ నిర్మాణాలను ఎందుకు తొలిగించకూడదంటూ నోటీసులు ఇచ్చారు. వీటి పైన వైసీపీ నేతలు న్యాయస్థానం ఆశ్రయించారు. తాము నిబంధనలు అతిక్రమించలేదని వైసీపీ కోర్టులో వాదించింది.

విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేతలు విషయంలో చట్ట నిబంధనలు పాటించాలని హైకోర్టు స్పష్టం చేసారు. రెండు నెలల సమయంలో భవనాల అనుమతుల రికార్డుల ను అధికారులకు ఇవ్వాలని వైసీపీకి సూచించింది. వైసీపీకి తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని నిర్దేశించింది. కూల్చివేతల విషయంలో చట్టం ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ప్రతీ దశలో వైసీపీ వాదన వినిపించేలా అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రమాదకరంగా ఉంటే తప్ప..కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని పేర్కొన్న హైకోర్టు..తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్నాక కట్టడాల విషయం లో ఓ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications