Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్ -అశోక్ గజపతి మాట వినాల్సిందే-మాన్సాస్ ఈవోకూ అక్షింతలు

విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజును తిరిగి నియమిస్తూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ఆయన్ను టార్గెట్ చేస్తున్న ఏపీ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. అశోక్ గజపతిరాజుకు సహాయనిరాకరణ చేస్తున్న మాన్సాస్ ఈవోకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. అశోక్ మాట వినితీరాల్సిందేనని స్పష్టం చేసింది. అంతే కాదు మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయటంతో పాటు తానే ఆడిట్ నిర్వహిస్తున్న వ్యవహారంలో ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది.

 జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్

జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్

విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజును నియమించడాన్ని జీర్ణించుకోలేక.. ఆయన్ను అడుగడుగునా టార్గెట్ చేస్తున్న వైసీపీ సర్కార్ కు ఇవాళ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ప్రభుత్వం చెప్పినట్లు వింటూ అశోక్ గజపతిరాజును లెక్క చేయని ఈవోపై హైకోర్టు సీరియస్ అయింది. అంతే కాదు ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. మాన్సాస్ లో అశోక్ నిర్ణయమే ఫైనల్ అని ఈవోకు హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో మాన్సాస్ ట్రస్టుపై పట్టుకు ప్రయత్నాలు చేస్తున్న జగన్ సర్కార్ కు హైకోర్టు నిర్ణయం భారీ షాక్ గా మారింది.

 మాన్సాస్ ఈవో తీరుపై హైకోర్టు ఆగ్రహం

మాన్సాస్ ఈవో తీరుపై హైకోర్టు ఆగ్రహం

మాన్సాస్ ట్రస్టుకు ఛైర్మన్ గా ఉన్న తన ఆదేశాల్ని ఈవో ఉల్లంఘిస్తున్నట్లు అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన పిటి్షన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈవో పాత్ర ఏమిటి, ఏం చేస్తారో చెప్పాలని హైకోర్టు నిలదీసింది. కోర్టు తీర్పును ఈవో ఎందుకు అమలు చేయడం లేదని ధర్మాసనం ఆయన్ను ప్రశ్నించింది. తాజాగా ఉద్యోగులకు జీతాల చెల్లింపు వ్యవహారంతో పాటు ఆడిట్ విషయంలోనూ ఈవో తీరును హైకోర్టు ఆక్షేపించింది.

 అశోక్ ఆదేశాలు పాటించాల్సిందే

అశోక్ ఆదేశాలు పాటించాల్సిందే

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు ఆదేశాలను ఈవో పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మాన్సాస్ వ్యవహారాలపై చైర్మన్ కు లేఖ రాసే ముందు హైకోర్టు తీర్పును ఎందుకు చూడలేక పోతున్నారని ధర్మాసనం ఈవోను ప్రశ్నించింది. మాన్సాస్ ట్రస్టులో ఆడిట్ పేరిట ఎవరెవరో వస్తున్నారని సీనియర్ న్యాయవాది సీతారామమూర్తి న్యాయవాది అశ్విన్ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో హైకోర్టు ఈ వ్యవహారంపైనా సీరియస్ అయింది.

 ఆడిట్ తో ఈవోకు సంబంధం లేదన్న హైకోర్టు

ఆడిట్ తో ఈవోకు సంబంధం లేదన్న హైకోర్టు

మాన్సాస్ ట్రస్టులో ఆడిట్ తో ఈవోకు సంబంధం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. అంతే కాదు జిల్లా ఆడిట్ అధికారి మాత్రమే అక్కడ ఆడిట్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ఆడిట్ తో పాటు ఈవో తీరుపై స్పందించిన హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. మాన్సాస్ లో చోటు చేసుకుంటున్న వ్యవహారాలు, ఆడిట్, ఉద్యోగుల జీతభత్యాల వ్యవహారంపై హైకోర్టుకు ఈవో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+