జగన్ కు ప్రతిపక్ష హోదాపై హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత 11 సీట్లకే పరిమితమైన వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఎన్డీయే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తోందని ఆరోపిస్తోంది. ఈ మేరకు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శులకు లేఖలు రాశారు. అయినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ జగన్ పిటిషన్ విచారణకు రావడంతో హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 11 సీట్లే వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా, జగన్ కు విపక్ష నేత హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్న నేపథ్యంలో ఆయన స్పీకర్ కు లేఖ రాశారు. ఇందులో ఆయన గతంలో 10 శాతం సభ్యులు కూడా లేకపోయినా పలువురు విపక్ష పార్టీల నేతలకు ఆ హోదా ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం మాత్రం అది స్పీకర్ విచక్షణ మేరకే ఇచ్చారని గుర్తుచేసింది. దీంతో జగన్ చేసేది లేక హైకోర్టును ఆశ్రయించారు.
జగన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి దీనిపై తమ అభిప్రాయం చెప్పాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ లోపు స్పీకర్, కార్యదర్శి తమ అభిప్రాయాలు హైకోర్టుకు తెలియజేయనున్నారు. దాని ఆధారంగా హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం మాత్రం విపక్ష హోదాపై నిర్ణయం స్పీకర్ కే ఉంటుందని చెబుతోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications