చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టు కీలక నిర్ణయం..!!
టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో అవకతవకలు జరిగాయని చంద్రబాబు పైన సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పిటీషన్ పైన కోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసారు. ముందస్తు బెయిల్ పైన తీర్పు రిజర్వ్ చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.
కీలక పరిణామాలు: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో పలు అక్రమాలు ఉన్నాయి సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో స్వార్ధ ప్రయోజనాల కోసమే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మూడుసార్లు మార్పు చేసారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.

అలైన్ మెంట్ మార్పు ద్వారా లింగమనేని రమేష్ కుటుంబంతో చంద్రబాబు, నాటి మంత్రి నారాయణ క్విడ్ ప్రోకో కు పాల్పడ్డారని పేర్కొంది. అలైన్ మెంట్ మార్చటం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కలిగించారని వివరించింది. క్విడ్ ప్రోకో కిందే చంద్రబాబుకు కరకట్ట పైన ఉన్న తన భవనం చంద్రబాబుకు అప్పగించారని సీఐడీ ఆరోపిస్తోంది.
సీఐడీ మొమో దాఖలు: తాజాగా ఈ కేసులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దర్యాప్తు అధికారులను లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని సీఐడీ మెమోలో పేర్కొంది. చంద్రబాబు కేసులు విచారిస్తున్న అధికారుల పై లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నట్లు కోర్టులో మొమో ద్వారా వివరించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కోరింది.
దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాదులను కౌంటర్ దాఖలు చేయాని కోర్టు ఆదేశించింది. దీని పైన చంద్రబాబు తరపు న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలు వినిపించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలు..చంద్రబాబు ముందస్తు బెయిల్ కు సంబంధం లేదని కోర్టుకు నివేదించారు. సీఐడీ మెమోను పరిగణలోకి తీసుకోవద్దని..రింగ్ రోడ్డు కేసు గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదని వివరించారు.
తీర్పు రిజర్వ్: ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ప్రస్తావన సీఐడీ మెమోలో దాఖలు చేయటం మినహా..ఎక్కడా ప్రస్తావించలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. దీంతో, వీటిని పరిశీలించిన న్యాయస్థానం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పైన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
ఇక..సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. వాదనలు పూర్తయిన తరువాత సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సుప్రీం ఇవ్వనున్న ఆ తీర్పు చంద్రబాబు కేసుల్లో కీలకం కానుంది. దీంతో..సుప్రీం క్వాష్ పైన ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications