వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్‌కు బిగ్ రిలీఫ్ - హైకోర్టులో స్టే ఎత్తివేత: తొలగిన అడ్డంకి..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో ఆంగన్‌వాడి సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నియామకాల ప్రక్రియను చేపట్టడంలో ఏర్పడ్డ న్యాయపరమైన చిక్కులు వీడిపోయాయి. నియామకాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- దీనిపై దూకుడుగా వ్యవహరించనుంది. సూపర్ వైజర్ల నియామకాల ప్రక్రియను మరింత వేగం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Gautam Adani: గౌతమ్ అదానీకి ఎదురుదెబ్బ.. మెగా పోర్టుకు అడ్డంకులు.. అసలేమైంది..?

ఆంగన్‌వాడి సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ అంశంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కొంతమంది అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మెరిట్ లిస్టులో పేర్లు ఉన్నప్పటికీ తమ నియామక ప్రక్రియను నిలిపివేశారని పేర్కొన్నారు. ఈ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ దీన్ని చేపట్టకుండా ఉండేలా స్టే‌ను ఇచ్చింది.

AP High Court revoke the stay on the recruitment of Anganwadi superwiser posts in the State

పిటీషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్ నర్రా శ్రీనివాస్ తన వాదనలను వినిపించారు. ఆంగన్‌వాడి సూపర్‌వైజర్ల పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఎంపిక అయినప్పటికీ.. పిటీషనర్లను పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఈ పోస్టులను భర్తీ చేయడానికి తాము అనుసరిస్తోన్న విధి విధానాలు, ఇతర మార్గదర్శకాల గురించి ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నామని వివరించారు.

వాదోపవాదాలను విన్న తరువాత హైకోర్టు దీనిపై విచారణను ముగించారు. స్టేను ఎత్తి వేస్తోన్నట్లు చెప్పారు. ఇదివరకు జరిగిన ఎంపిక ప్రక్రియ విధానాన్ని ఆధారంగా చేసుకున్నారు న్యాయమూర్తులు. దాని ప్రాతిపదిక మీదే ఎంపికైన అభ్యర్ధుల జాబితాకు అనుమతి ఇచ్చారు. అభ్యర్థులు దాఖలు చేసిన పిటీషన్లను కొట్టివేశారు. పాత విధానాన్ని కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.

English summary
AP High Court revoke the stay on the recruitment of Anganwadi superwiser posts in the State
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X