ఏపీ ప్రభుత్వానికి అమరావతిలో మరో షాక్ : అసైన్డ్ రైతులకు ఊరట -ఆ జీవో పై స్టేటస్ కో..!!

అమరావతి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానంలో నిలబడటం లేదు. తాజాగా.. అమరావతి పరిధిలో అసైన్డ్ భూముల కు సంబంధించిన వ్యవహారంలోనూ ప్రభుత్వం జారీ చేసిన జీవో పైన హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. అసైన్డ్ రైతుల భూముల క్రయ విక్రయాలకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 316పై ధర్మాసనం స్టేటస్ కో మెయిన్ టెయిన్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయని..ప్రభుత్వంలోని ప్రముఖులు అసైన్డ్ భూముల పేరుతో స్థలాలు సొంతం చేసుకున్నారనేది ప్రభుత్వ ఆభియోగం. దీంతో..గత ప్రభుత్వం రాజధాని కోసం భూములిచ్చిన అసైన్డ్ రైతుల కోసం జోవో నెంబర్ 41 ను విడుదల చేసింది. అసైన్డ్ భూముల వారికి స్పెషల్ ప్యాకేజి విధానంలో భాగంగా స్థలాలు కేటాయిందని పిటీషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ప్రభుత్వం అసైన్డ్ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కు తీసుకుంటూ గతంలో నోటీసులు జారీ చేసింది.

AP High court status co orders on GO no 316 issued by AP Govt on Amaravti assigned lands

అధికారికంగా జీవో జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 316 పైన ఈ రోజున హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది ఇంద్రనీల్ బాబు జీవో నెంబర్ 316ను హైకోర్టులో సవాలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా కేటాయించిన ప్లాట్‌లను రద్దు చేసేందుకు జీవో ఇచ్చారని ఇంద్రనీల్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం వైపు వాదనలు విన్న అనంతరం ధర్మాసనం స్టేటస్ కో విధించింది. తదనంతర ప్రక్రియ చేపట్టవద్దని ఏఎమ్ఆర్డీఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని..అధికారంలో ఉన్న మంత్రులు..పార్టీ నేతలు వీటిని ముందస్తు సమాచారంతో కొనుగోలు చేసారంటూ ఆరోపణలు చేసింది. అదే విధంగా అసైన్డ్ భూముల వ్యవహారంలోనూ లబ్ది దారులను మోసం చేసిందనేది ప్రభుత్వ వాదన. దీని పైన అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేయించిన ప్రభుత్వం..ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిందంటూ చర్యలు మొదలు పెట్టింది.

ప్రభుత్వ చర్యలను న్యాయస్థానాలు సమర్ధించలేదు. అమరావతి లో ని్ సైడర్ ట్రేడింగ్ లేదని తేల్చి చెప్పాయి. ఇక, ఇప్పుడు అసైన్డ్ భూముల విషయంలోనూ ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంలో స్టేటస్ కో అమలు చేయాలంటూ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు దీని పైన ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+