జగన్ పరువునష్టం దావా కేసు..! నేడు హైకోర్టు విచారణ..

ఏపీ హైకోర్టు ముందుకు ఇవాళ ఓ కీలక కేసు విచారణ రాబోతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ కు చెందిన సాక్షి పత్రికలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు భూముల అక్రమాల్లో మంత్రి నారాయణ పాత్రపై రాసిన కథనాలపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయన పరువునష్టం దావా వేశారు. దీన్ని కొట్టేయాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ జరపబోతోంది.

అమరావతి రాజధాని నిర్మాణ క్రమంలో చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్పుల వెనుక అప్పటి మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ పాత్ర ఉందంటూ రాసిన కథనాలు తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో దావా వేశారు. దీనిపై గతంలో అక్కడ విచారణ జరిగింది. అలాగే జగన్ హాజరు కావాలని పలుమార్లు కోర్టు సమన్లు కూడా పంపింది. అయినా ఆయన హాజరు కాలేదు. ఆ తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

ap high court to hear ys jagan s plea to quash minister Narayana s defamation suit against him

గతంలో మంత్రి నారాయణ విజయవాడలోని ప్రజాప్రతినిధుల కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన పరువునష్టం కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. ఈ కేసులో జగన్ విచారణ ఎదుర్కోవాలా లేదా అన్నది హైకోర్టు తేల్చబోతోంది. ఒక వేళ హైకోర్టు విజయవాడ కోర్టులో పెండింగ్ లో ఉన్న పరువునష్టం దావా కేసును ఎదుర్కోవాల్సిందేనని జగన్ కు స్పష్టం చేస్తే ఇబ్బందులు తప్పవు. అలా కాకుండా క్వాష్ చేస్తే మాత్రం జగన్ కు భారీ ఊరట దక్కనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+